అయోధ్యలోని రామ్ లల్లా విగ్రహాన్ని రూపొందించిన శిల్పి అరుణ్ యోగిరాజ్ మరియు అతని కుటుంబ సభ్యులకు అమెరికా వీసాలు నిరాకరించింది. వర్జీనియాలోని రిచ్‌మండ్‌లో జరగనున్న అసోసియేషన్ ఆఫ్ కన్నడ కూటాస్ ఆఫ్ అమెరికా, వరల్డ్ కన్నడ కాన్ఫరెన్స్-2024 కార్యక్రమం లో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులతో పాటు వీసా కు అప్లాయి చేసుకున్న యోగిరాజ్ దరఖాస్తును యుఎస్ ఎంబసీ అధికారులు తిరస్కరించారు. వీసా రిజక్ట్ పై ఎటువంటి కారణాలు చెప్పలేదు. గతం లో ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి గా వున్న సమయంలొ ఏకంగా అమెరికా రావడానికి వీల్లేదంటూ నిషేధం విధించి తరువాత ప్రధాని అయిన తరవాత అమెరికా అధ్యక్షుడు అధికారిక పర్యటన కు ఆహ్వానించిన విషయం తెలిసిందే.. అయితే ఒక కళాకారుడిగా శిల్పి యోగీరాజ్ అమెరికా పర్యటన వీసా ను నిరాకరించడం సరైనది కాదని ప్రజా సంఘాలు,కళాకారులు, మరికొన్ని కన్నడ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి.
next post