Vaisaakhi – Pakka Infotainment

ఏపీ లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన స్పెషాలిటీ హాస్పిటల్స్

మే 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వానికి స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం ప్రకటించింది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో లక్ష్మీ షాకు రాసిన ఈ లేఖలో పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడాన్ని ప్రస్తావిస్తూ గతేడాది ఆగస్టు నుంచి ఉన్న 1,500 కోట్ల పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. సుదీర్ఘ కాలంగా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం తెలిపింది. గతం లో లేఖలు రాస్తే కేవలం 50 కోట్లు మాత్రమే చెల్లింపులు చేశారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ వెల్లడించింది.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More