ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారని వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ గద్దె దిగడం ఖాయమని ఆ మాజీ కేంద్రమంత్రి చెప్పడమే కాకుండా ఏపీ లో 2024 లో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరబోతోందని ముందస్తు జోస్యం చెప్పేసారు.. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ లో భూస్థాపితం అయిన కాంగ్రెస్ పార్టీని చాలా మంది వదిలేసిన కరడుగట్టిన కొంతమంది కాంగ్రెస్ వాదులు ఇంకా ఆ పార్టీ లొనే ఉంది ఆ పార్టీ పట్ల విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు.. దాదాపు అందరూ ప్రాక్టీకల్ గా ఉండగా మరికొందరు అత్యుత్సాహం తో ఇదిగో అప్పుడప్పుడు ఇలాంటి స్టేట్మెంట్ లు ఇచ్చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ కన్నా కాస్తంత బెటర్ ఓట్ల పర్సెంటేజ్ కనబరిచిన కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారం లోకి వస్తుంది అనడం అలాంటిదే మరి.. మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ తన జోస్యం లో వైసీపీ, టీడీపీ లకు చెరో పాతిక సీట్లు మాత్రమే ఇచ్చారు. అధికార వైసీపీ నాయకులు తీవ్ర నిరాశ లో ఉన్నారని ఆ పార్టీ లో ఇమడలేక ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారని, తిరిగి ఆ పార్టీ అధికారంలోకి రాదని స్పష్టం గా చెప్పేసారు.. రాజధానిపై ముఖ్యమంత్రి రోజుకోరకంగా మాట్లాడుతున్నారని, ప్రజలు ఆయన్ను విశ్వసించడంలేదని, జగన్ హయాంలో ప్రజలు సంతోషంగా లేరన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో తిరిగి అధికారంలోకి రాబోతోందని కుండబద్దలు కొట్టారు.. అదే జరిగితే ఎన్నికల్లో కీలకం అనుకున్న జనసేన, బీజేపీ ల పరిస్థితి ఎంటో మరి..
previous post