Vaisaakhi – Pakka Infotainment

కునుకులేకుండా చేస్తున్న కోవర్టులు…

ప్రాంతాలకు, వర్గాలకు అతీతంగా కోవర్ట్లు దూసుకుపోతున్నారు..అటు ఆంధ్రా ఇటు తెలంగాణ.. కోవర్టు రాజకీయ ప్రకంపనలతో అల్లాడుతున్నాయి.. అన్ని పార్టీ ల్లో బీఆరెస్ కోవర్టులు ఉన్నారని చాలా కాలం క్రితం ఈటెల చెప్పిన మాటల్నే బలపరుస్తూ ఓ వైపు పల్లా రాజేశ్వరరెడ్డి, మరోవైపు బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీస్తే.. టీడీపీ జనసేన పొత్తు అధికారికంగా ఫిక్స్ కాకపోడానికి కొద్ది మంది కోవర్టు లే కారణమని ఆంధ్రా లో బలమైన వాదన వినిపిస్తున్న తరుణం లో మరోసారి కోవర్టు ల అంశం తెరపై కొచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలకు కోవర్టులకు బెడద అయితే తప్పట్లేదు.గత ఎన్నికల సమయంలో కూడా ఇదే జరిగింది.దీని ఫలితంగా ఊహించని ఫలితాలు వచ్చాయి.ప్రత్యర్ధులు గెలవాల్సిన సీట్లను, మెజార్టీ ఓట్లను లాక్కోవడమే కొన్ని రాజకీయ పార్టీల పని. అలాగే ఆ పార్టీల అంతర్గత వ్యవహారాలను, రాజకీయ వ్యూహాలను కోవర్టుల ద్వారా ముందుగానే తెలుసుకొని అప్రమత్తమవడం తో చాలా చోట్ల చివరి నిమిషంలో ఫలితాలు తరుమారైన సంఘటన లున్నాయి..సీనియర్ ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తెలుగు రాజకీయాలలో ఈ ఒరవడి పెరిగిందనే చెప్పాలి. అది ఎంతవరకు వెళ్ళిందంటే సీనియర్ ఎన్టీఆర్ ని ముఖ్యమంత్రి పదవి నుంచి ఆకస్మికంగా తప్పించేవరకు ఈ పరిస్థితి కొనసాగింది.ఆ తర్వాత ఇది రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సమయంలో కూడా తారాస్థాయికి చేరుకుంది. పోలీసు, మావోయిస్టుల వ్యవహారాల్లో ఎక్కువ గా వినే ఈ కోవర్ట్ పదం ఇప్పుడు అది రాజకీయాలలో రెగ్యులర్ గా వినాల్సి వస్తుంది. గత ఎన్నికలలో అయితే ఈ కోవర్ట్ ఆపరేషన్ విజయవంతంగా జరిగిందనే చెప్పాలి.అన్ని పార్టీలు తమ ప్రత్యర్థి పార్టీలలోకి తమ మనుషులను పంపించడం జరిగింది. అయితే అటు వైసిపికి , ఇటు తెరాస కు బాగానే లాభించింది.

ఇతర పార్టీలకు వెళ్ళిన వాళ్ళు తమ పనిని చక్కగా నిర్వహించారు.ఇతర పార్టీలలో ఉంటూనే ఎప్పటికప్పుడు విలువైన సమాచారాన్ని మాతృ పార్టీ లకు అందజేసి తరించారు.. ఇకఆంధ్రప్రదేశ్ లో అయితే టిడిపి జనసేన నుంచి వైసీపీకి వచ్చిన కోవర్టులు డబల్ గేమ్ ఆడుతూ వైసిపి అనునుకూలంగా వ్యవహరించారు.దీనికి తోడు కేంద్ర బీజేపీ ప్రభుత్వం వైసీపీకి అండగా ఉండటంతో ఆ పార్టీకి బాగానే కలిసి వచ్చింది.గత టిడిపి ప్రభుత్వం చివర్లో చేసిన కొన్ని తప్పిదాలు వైసీపీకి అనుకూలంగా మారాయి.వాటినే తన ప్రచారాస్త్రాలుగా వైసిపి నేతలు పట్టుకున్నారు.జనాల్లోకి వెళ్లారు.ఇక జనసేన కూడా బిజెపితో కలిసి విడిగా పోటీ చేసింది.బిజెపి జనసేన కూటమి గెలవదనే ముందే తెలిసినప్పటికీపోటీకి దిగాయి. ఘోరంగా ఓటమి చెందాయి.పవన్ కళ్యాణ్ కుటిడిపి పై ఉన్న కోపం,దీనికి తోడు బిజెపి- టిడిపి మధ్యన ఉన్న వైరాన్ని వైసిపి తనకు అనుకూలంగా మార్చుకోవడం వైసిపికి ఫలించిందనే చెప్పాలి. కలిసి ఉన్న టిడిపి- జనసేన -బిజెపి పార్టీలనువిడదీసి వాటిని విడివిడిగా పోటీ చేసేలా ప్రయత్నం చేయడంలో వైసిపి విజయం సాధించిందని చెప్పాలి.వైసిపి అధికారంలోకి రావడానికి కూడా బిజెపి కూడా పూర్తిగా సహకరించింది.అయితే ఈ తతంగం అంతా పూర్తి చేయడానికి పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా మారడానికి కోవర్టుల వల్లే జరిగిందన్నది తెలుస్తుంది.మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి.ఎవరి వ్యూహాలలో వాళ్ళు ఉన్నారు.అసంతృప్తుల పేరిట కొందరు కోవర్ట్ ల రూపంలో ప్రత్యర్ధుల పార్టీలలో చేరుతున్నారు.ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన పార్టీలలో ఇది సర్వసాధారణమై పోయింది..ఇందులో స్వచ్ఛందంగా, నిజాయితీగా వచ్చే వాళ్ళు కొందరైతే.ప్రత్యర్థి పార్టీ వాళ్ళు కావాలని పంపించిన వారు మరికొందరు ఉన్నారు. రానున్న ఎన్నికలలో పార్టీలు నిర్వహించే సర్వేలతోపాటు పోలీసులు, అధికారులు ఇచ్చే సమాచారం కూడాఅధికార ప్రభుత్వానికి కీలకంగా మారింది.అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలలో ఉన్న తమ మనుషులు ఇచ్చే సమాచారం కూడా కీలకం కానుంది.అయితే అధికారి పార్టీలో కూడా ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా వ్యవహరించే వాళ్ళు కూడా ఉన్నారు.పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో ఊహించని విధంగా పరిస్థితులు మారుతున్నాయి.దసరా తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరదశకు చేరుకోబోతున్నాయి..

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More