Vaisaakhi – Pakka Infotainment

డీప్ ఫేక్ పాలి’ట్రిక్స్’

ఫేక్ లందు డీప్ ఫేక్ లు వేరయ..అంటూ కొత్త భాష్యం చెబుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాయి రాజకీయ పార్టీలు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అన్న తేడా లేదు. ఆ పార్టీ ఈ పార్టీ అన్న మేటరు లేదు ఫేక్ ప్రచారాలను అన్ని మీడియాల సాక్షిగా నిస్సిగ్గుగా ప్రచారానికి వాడేస్తున్నారు రాజకీయ నేతలు.. ఒకప్పుడు విలువలకు కట్టుబడి చేసే ప్రచారం ఈరోజు కట్టు తెంచుకొని విద్వేషాలను వర్షిస్తుంది… సోషల్ మీడియా విస్తృతి చెందడం. ఏఐ లాంటి టెక్నాలజీలు సులువుగా అందుబాటులోకి రావడంతో ఫేక్ ప్రచారం మరింత జడలు విప్పుకుంది.. దానికి తోడు సాంకేతికత మరింత వృద్ధి చెంది డీప్ ఫేక్ యాక్సెస్ చాలా ఈజీ కావడంతో ప్రచారం వెర్రితలలు వేస్తోంది.. నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందిన సినీనటి రష్మిక మందన్న వీడియో వైరల్ కావడంతో డీప్ ఫేక్ అనేది విస్తృత ప్రచారంలోకి వచ్చింది.. వేరే ఒక మోడల్ విజువల్ కు రష్మిక ఫేస్ ని తగిలించి ఒక రీల్ ని ప్రచారంలోకి వదలడంతో ఆ వీడియో వైరల్ అయి చివరకు వివాదంగా మారింది. అయితే ఆ డీప్ ఫేక్ కు సినీ నటులే కాదు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలు, క్రికెటర్లు ఇతర సెలబ్రిటీలు, చివరకు సామాన్యులు కూడా బాధితులుగా మారుతున్నారు ఇలాంటి డీప్ ఫేక్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది.. లింక్ ల సాక్ష్యాలతో పాటు సబ్మిట్ చేసింది.. అమిత్ షా ఫేక్ వీడియో విషయాన్ని బీజేపీ గట్టిగానే తీసుకుంది దీనిపై దేశవ్యాప్త దర్యాప్తు చేపట్టి ఇప్పటికే చాలామందికి నోటీసులు పంపడమే కాకుండా ముగ్గురిని అరెస్ట్ చేసింది.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీడియో ను రెండు ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ల నుంచి సోషల్ మీడియాలో షేర్ చేసినట్టు గుర్తించి సెక్షన్లు 505A, 1B, 469, 153A.. IT చట్టం కింద FIR నమోదు చేయడం జరిగింది. ఒక ఫేస్‌బుక్ ప్రొఫైల్ సతీష్ వాన్సోలా పేరిట, మరో ప్రొఫైల్ ఆర్బీ బరియా పేరిట ఉంది. నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. వీరికి రాజకీయ పార్టీలతో సంబంధాలున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు చెప్తున్నారు..డీప్ ఫేక్ ను సరదా కోసం చేస్తున్నాం అని ప్రకటించి చేస్తే పర్వాలేదు గానీ సీరియస్గా ఆయా వ్యక్తులను కించపరుస్తున్నట్లుగా వీడియో వైరల్ చేయడం నేరమే.. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డాన్స్ చేస్తున్నట్టుగా ఒక డీప్ ఫేక్ ను వదిలి వైరల్ చేశారు అలాగే ఇతర ప్రాంతీయ పార్టీల నేతలకు కూడా కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి అన్నట్లుగా ఒక దళిత వ్యతిరేక ప్రసంగాన్ని వైరల్ చేశారు. వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీతో ఈ ఆడియో తయారు చేశారని దాన్ని ఎవరు విశ్వసించవద్దని తెలుగుదేశం పార్టీ నేతల విజ్ఞప్తి చేసినప్పటికీ చాలామంది నెటిజన్ల మధ్య ఈ వ్యాఖ్యలపై పెద్ద వివాదమే చెలరేగింది అలాగే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తగిలిన గాయంపై అదే విధంగా పవన్ కళ్యాణ్ నాలుగో పెళ్లిపై చేసిన కామెంట్లపై చాలా డీప్ ఫేక్ వీడియోలు ఏఐ ఆధారిత ఇమేజ్లు విపరీతంగా చెక్కర్లు కొట్టాయి ఇక వివేకానంద రెడ్డి హత్యలకు సంబంధించి చంద్రబాబునాయుడు పవన్ కళ్యాణ్ ని మధ్య పొత్తు గురించి తెలంగాణలో కేసీఆర్ ఓటమి గురించి ఇక లెక్కలేనన్ని ఫేక్ పోస్ట్లు స్వైర విహారం చేశాయి ఎక్కడో అమెరికాలో ఇలాంటి టెక్నాలజీ కనిపెట్టి కనిపెట్టినప్పటికీ డీప్ ఫేక్ వాడకంలో చైనా, ఇండియా ముందు వరుసలో ఉన్నాయని నిపుణులు అంటున్నారు డీప్ ఫేక్, వాయిస్ క్లోనింగ్, ఏఈ ,వంటి టెక్నాలజీతో సరదాకో లేక విజ్ఞానానికి వాడితే ఏ ప్రాబ్లం ఉండదని కానీ దానిని ఇతరుల ప్రైవసీకి వారి వారి వ్యక్తిగత జీవితాల పై ప్రభావం చూపే విధంగా వాడటంపై తీవ్రమైన చర్యలు ఉండాలని వారు సూచిస్తున్నారు విషయం తెలిసిందే అయితే దేశాన్ని రాజకీయాల్ని ప్రభావితం చేసే అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతదేశం ఎన్నికల్లో ఇలాంటి టెక్నాలజీ హల్చల్ చేస్తుండడం వీటి గురించి కనీస అవగాహన లేనివారు ఇది నిజమని నమ్మితే దానికి మూల్యం భారీగానే ఉండవచ్చు ఇప్పటికే తెలుగుదేశంకి అనుకూల పత్రిక అయిన ఆంధ్రజ్యోతి వెబ్సైట్ ను ఒక ఆంధ్రజ్యోతి యాప్ ను నకిలీవి సృష్టించడమే కాకుండా ఫేక్ వార్తలతో ఆంధ్రజ్యోతి ఈ పేపర్ను కొంతమంది నకిలీగాళ్లు చలామణి చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ మరియు డేటా చోరీతో ఫేక్ గాళ్ళు చెలరేగిపోతున్నారు. దురదృష్టకర పరిణామమం ఏంటంటే వీటిని అన్ని పార్టీల వాళ్ళు ఉపయోగించుకోవడం విచారకరం పార్టీ కార్యాలయం నుంచి వచ్చే ప్రెస్ నోట్స్ కూడా ఈ ఫేక్ నుంచి తప్పించుకోలేకపోతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు వీటిపై కేవలం ఎలక్షన్ కమిషన్ మాత్రమే కాకుండా సిబిఐ ఈడి వంటి సంస్థలు కూడా దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాల్సిందే.. తమకు ఉపయోగపడుతుందని ఇలాంటి వాటిని ఎవరు ప్రోత్సహించిన తిరిగి ఈ నకిలీలు వారికే ప్రమాదంగా మారుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు..(అవగాహన కోసమే ఈ ఆర్టికల్ రాయడమైంది.. ఎటువంటి వివాదాస్పద అంశాలను ప్రోత్సహించే ఉద్దేశ్యం లేదని మనవి -ఎడిటర్)

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More