కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ లో భాగం గా ఆగష్టు పదిహేను నుంచి ప్రారంభించాలనుకున్న
ఏపీఎస్ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరో రెండు నెలలు వాయిదా పడినట్టుగా తెలుస్తోంది.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రాబోయే రెండు నెలల్లో ప్రారంభిస్తామంటూ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.. గడిచిన రెండు రోజుల క్రితం త్వరలోనే అయిపోతుంది అంటూ తెలిపిన రవాణా శాఖ మంత్రి మరో రెండు నెలల్లో అనడంతో మహిళలు కాస్త నిరుత్సాహంతో ఉన్నట్లు తెలుస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణ విషయాన్ని మరో రెండు నెలల ప్రకటిస్తామని చెప్పినప్పటికీ.. ఇంకాస్త సమయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కూటమి ప్రభుత్వం కనిపిస్తోంది. కర్ణాటక , తెలంగాణ లో ఉన్న ఉచిత బస్సు ప్రయాణం విషయమే కూలంకషంగా పరిశోధించి ఇక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా వుండేలా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది
previous post
next post