Vaisaakhi – Pakka Infotainment

అన్నీ రివర్సే.. రేపు కూడా అంతేనా..?

2019 ఎన్నికల్లో అధికార పార్టీగా తెలుగుదేశం పార్టీ కోరుకున్నట్టు ఒక్క పని అంటే ఒక్కటి కూడా ఆ పార్టీ కి అనుకూలంగా జరిగిన పరిస్థితి లేదు.. లాస్ట్ మినిట్ లో పంచిన తాయిలాలు కూడా రివర్స్ ట్రీట్ నే ఇచ్చాయి.. ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం అధికార టీడీపీ కి ఆపొజిట్ గానే జరిగింది. అధికారుల మార్పు ఆ పార్టీ సిఫారసుల మేరకే జరిగింది… పోలింగ్ కూడా వారికి లబ్ధి చేకూరేలా నిర్వహించారు.చంద్రబాబుపై కేంద్ర పెద్దల ఆగ్రహాన్ని నాడు జగన్ సద్వినియోగం చేసుకున్నారు. అయితే ఇప్పుడు అదే పరిస్థితి జగన్ కు ఎదురవుతోందన్న విషయం స్పష్టం గా కనిపిస్తోంది.ఈ ఎన్నికల్లో ఈసీ నిర్ణయాలపై కూడా కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి అధికార వైసీపీకి దాపురించింది….ఒక్కటంటే ఒక్కటి కూడా అనుకూలంగా లేదు. చివరకు పోలింగ్ నాడు సహకరిస్తారనుకున్న యంత్రాంగం ఎదురు తిరిగే పరిస్థితే కనిపించింది.నిన్న మొన్నటి వరకు పోలీస్ శాఖకు ఆదేశాలు ఇచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారిపై.. అదే పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసిన దుస్థితిసేమ్ తో సేమ్ గత ఎన్నికల సమయంలో ఒక్క అధికారి కూడా టిడిపి మాట వినలేదు. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా పెట్టారు. ఇప్పుడు ఆ అనుభవం వైసీపీ కి ఎదురవుతుంది.నెల్లూరు జిల్లా కలెక్టర్ తమకు సహకరించలేదని.. కూటమికి అనుకూలంగా పనిచేసారని సాక్షాత్తు ఆ జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి , ఎలక్షన్ కమిషన్ మొత్తం టిడిపి కూటమికి బాగా సహకరించిందని నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ,మంత్రి అంబటి రాంబాబు అయితే తన నియోజకవర్గంలో రెండు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం పేర్ని నాని తమ ఫిర్యాదులను పట్టించుకోని ఎలక్షన్ కమిషన్.. టిడిపి కూటమి నేతలు ఇలా అడిగారో లేదో యాక్షన్ లోకి దిగుతున్నారని వాపోవడం ఇలా చాలా సంఘటనలు దీనికి అద్దం పడుతున్నాయిముఖ్యంగా….రాష్ట్రంలో శుక్రవారం రెండు ఘటనలు వైసీపీకి కంటిమీద కునుకు లేకుండా చేశాయి.!!ఒకటి ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్, రెండు సజ్జల రామకృష్ణారెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు.. ఈ రెండు పరిణామాలతో వైసిపికి తత్వం బోధపడింది. పూర్తిస్థాయి క్లారిటీ వచ్చింది. అధికారుల్లో మార్పు, న్యాయస్థానాల తీర్పులు చూసి ఎక్కడో తేడా కొడుతోంది అన్న అనుమానాలు బలపడుతున్నాయి._ కేవలం నాయకత్వం మేకపోతు గాంభీర్యం చూపిస్తోందని.. సగటు వైసిపి అభిమాని ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే సజ్జలపై కేసు నేపథ్యంలో.. రేపు అంటూ ఒకటి ఉంటుందని పేర్ని నాని అధికారులను హెచ్చరించారు.అయితే ఆయనకు తెలియంది కాదు.. రేపు అనేది ఒక క్లారిటీ రావడం వల్లే అధికారుల్లో ఇంత మార్పు వచ్చిందన్న విషయం ఆయన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది!!వరుసగా జరుగుతున్న పరిణామాలు వైసీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.ఈ ఇన్సడెంట్లన్నీ చూసిన వైసీపీ నేతలకు కనీసం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల చెల్లుబాటు విషయంలో న్యాయస్థానంలో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందన్న నమ్మకం అయితే కనిపించడం లేదు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More