ఏపీలో జరిగిన ఎన్నికలలో కూటమి తరుపున నిలబడిన సిట్టింగ్ అభ్యర్థుల విజయానికి ఎటువంటి డోకా లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల ముందుగా లాస్ట్ మినిట్ లో
వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి టిక్కెట్లు ఇవ్వడం కూడా కూటమి విమర్శల పాలయ్యింది. వారికి టికెట్ ఇచ్చిన నియోజకవర్గాల్లో వైసిపి అభ్యర్థులతో గట్టి పోటీ ఉందన్న విషయం అవగతమవుతుంది. కూటమి నుంచి నిలబడిన ఆ అభ్యర్థుల పరిస్థితి డోలాయమానంలో ఉంది. వారే స్వయంగా ఈ విషయం చెప్పడం విశేషం. ఇదిలా ఉండగా టిడిపి నుంచి సిట్టింగ్ అభ్యర్థులు ఎక్కువమంది పోటీలో ఉన్నారు వీరు గెలుపును అయితే ఎవరు ఆపేది లేదు. సునాయాసంగా ప్రత్యర్థులకు నెగ్గుకు రాగల సమర్థులు. అయితే టిడిపిలో కొంతమంది కొత్త అభ్యర్థులకు కూడా సీట్లు వచ్చాయి. ఈక్వేషన్స్ తో ఆఖరి నిమిషం లో బీ ఫామ్ దక్కించుకుని బరిలోకి దిగిన వారు మాత్రం టెన్షన్ లో పడ్డారు.. అంతవరకు ఇంచార్జ్ లుగా ఉండి టికెట్ దక్కించుకోలేని వారు నిజాయితీ గా తనకే పని చేశారా లేక లోపాయకారి ఒప్పందాలతో కొంప ముంచారా.? ఇప్పుడు అలాంటి అభ్యర్థుల్లో ఇదే బెంగ. క్షేత్రస్థాయిలో టిడిపి పటిష్టంగా ఉండటంతో ఆ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదన్నది తెలుస్తున్నప్పటికి
ప్రత్యర్థులతో టఫ్ ఫైట్ అనేది తప్పదు అనేది తేలింది.
ఇక జనసేన విషయానికొస్తే ఈ పార్టీ కూడా చాలా మంది కొత్త ముఖాలకు సీట్లు ఇవ్వడం జరిగింది. ఈ పార్టీ క్షేత్రస్థాయిలో అయితే బలోపేతంగా లేదు. అటు కూటమిలో ఉన్న బిజెపి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ రెండు పార్టీల నుంచి నిలబడిన అభ్యర్థులకు వైసిపి గట్టి పోటీ ఇచ్చింది. అనేది ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నప్పటికీ పరిస్థితులు ఎలా అన్న మారవచ్చు అనేది కౌంటింగ్ తర్వాత తెలియనుంది.
ఇక వైసీపీ కి వచ్చేసరికి ఈ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉంది.
ప్రధాన పోటీ అయితే ఈ పార్టీకి టిడిపితో అన్న విషయం అందరికీ తెలిసిందే. నువ్వా నేనా అన్నట్లు టిడిపి అభ్యర్థులు వైసీపీ అభ్యర్థుల మధ్య చాలాచోట్ల పోరు కొనసాగింది. అయితే ఈ పార్టీలో ఉన్న కొందరు సిట్టింగ్ అభ్యర్థులు గల్లంత అవడం ఖాయం అనేది స్పష్టంగా తెలుస్తుంది.
ఐదేళ్ల పాలనలో ప్రజా సమస్యలపై ఎక్కువగా మాట్లాడింది సజ్జల రామకృష్ణారెడ్డి తప్ప మంత్రులు కానీ లేదా ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ కాదన్నది అందరికీ తెలిసిన విషయమే. కనీసం వారి శాఖలకు సంబంధించి మంత్రులు మాట్లాడిన పరిస్థితులు ఎక్కడా కనిపించలేదు.
దీనిపై కూడా ప్రజలలో పెద్ద చర్చ కొనసాగింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా పెద్ద హోప్ పెట్టుకున్నారు 175 కి 175 సీట్లు కచ్చితంగా తమ పార్టీ గెలుస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేస్తున్నారు.
కానీ గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితులు ఆయన ఊహించినట్టుగా లేవు. వైసీపీలో చాలామంది సిట్టింగ్ అభ్యర్థులు కూటమి అభ్యర్థుల చేతిలో ఓడిపోతారన్నది ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న మాట. మరి కొన్ని గంటలలో కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. ఇదిలా ఉండగా అటు కూటమి ఇటు వైసిపి తమకు అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ పై సంబరపడుతున్నాయి. తామే అధికారంలోకి వస్తామని జోస్యం చెబుతున్నాయి. ఈ ఎన్నికలలో ఎవరిది పై చేయి ఎవరు అధికారంలోకి వస్తారనేది ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
previous post
next post