ఫలితాలు రావడానికి మరి కొన్ని రోజులు సమయం ఉండడంతో ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. పోస్టుపోల్ సర్వే లపై ఎన్నికల కమిషన్ నిషేధం ఉన్నప్పటికీ చాలామంది మీడియా, సర్వే సంస్థలప్రతినిధులు గెలుపు అంచనాలపై విశ్లేషనాత్మక సర్వేలు బయటపెడుతున్నారు. సర్వేల మాట అటుంచితే మేమే ఏపీ లో అధికారంలోకి రాబోతున్నామని ఇరువర్గాలు గట్టి ధీమా మీద ఉన్నారు.. ఎవరికి వారు ప్రమాణ స్వీకారానికి ముహూర్తాలు, ప్లేస్లు నిర్ణయించేసుకున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి అధికారికంగా ప్రమాణస్వీకారం తేదీ, స్థలం, ముహూర్తం చెప్పకపోయినప్పటికీ కేంద్రమంత్రి అమిత్ షా అన్నట్టుగా ప్రచారం జరుగుతున్న తేదీ జూన్ 9 అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పిన తేదీ అంటూ జూన్ 11 ప్రచారంలో ఉంది. తేదీ ఏదైనప్పటికీ అమరావతిలో రాజధాని శంకుస్థాపన చేసిన ప్రాంతంలోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారని ప్రచారం. ఇక వైఎస్ఆర్సిపి నాయకులయితే ప్రెస్మీట్ పెట్టి మరి జూన్ 9న ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రతిపాదిత రాజధాని విశాఖపట్నంలో తిరిగి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారని దీని ఏర్పాట్లు అన్ని ఆయన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి చూస్తున్నారని అధికారికంగా చెప్పేస్తున్నారు. రాజధాని విషయంలో పోటీపడిన అమరావతి, విశాఖపట్నం ఇప్పుడు ప్రమాణ స్వీకారం విషయంలో కూడా పోటీ పడుతుండడం విశేషం..ఇదిలా ఉండగా ప్రమాణ స్వీకారం డేట్లు, ముహుర్తాలు, సిద్ధం చేసుకున్న ఇరువర్గాలు మంత్రివర్గ కూర్పు పై కూడా ఇప్పటికే ఒక డెసిషన్కు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ ఇండియాలో లేనప్పటికీ మంత్రివర్గ లిస్టులయితే జోరుగా సర్క్యులేట్ అవుతున్నాయి. అత్యంత కీలకనేత పవన్ కళ్యాణ్ ఏ పదవి స్వీకరిస్తారన్నదాని పై తీవ్ర ఉత్కంఠ ఉన్న సమయంలో లేటెస్ట్ గా రాష్ట్ర మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ ఉండబోరని ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వెళ్లబోతున్నారు అన్నది ఇప్పుడు వినిపిస్తున్న మాట. అలాగే రాష్ట్రంలో మరో కీలక నేత లోకేష్ కూడా రాష్ట్ర మంత్రివర్గంలో కాకుండా కేంద్ర పదవి తీసుకోబోతున్నారని సమాచారం.ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఏ పదవి తీసుకోకుండా పార్టీ బలోపేతానికి పనిచేస్తారని ఓ టాక్ నడుస్తోంది. ఇక కొత్తగా ఏర్పడబోయే మంత్రి వర్గంలో ముఖ్యమంత్రి కాకుండా మంత్రివర్గంలో మరో 25 మందికి అవకాశం ఉన్న నేపథ్యంలో జనసేనకు నాలుగు, బీజేపీకి రెండు నుంచి మూడు మంత్రి పదవులు లభించనున్నాయి.. ఈక్వేషన్స్ లో భాగంగా కేంద్రమంత్రి పదవులు రాష్ట్ర మంత్రి పదవులు జిల్లాల ప్రాతినిధ్యం తో వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. కేంద్ర మంత్రిగా దాదాపు రామ్మోహన్ నాయుడుకి పదవి ఖాయమని గట్టిగానే గుసగుసలు వినిపిస్తున్నాయి రాష్ట్రం నుంచి బిజెపి చెందిన పురందేశ్వరి, సీఎం రమేష్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా కేంద్ర పడవులు లభించే అవకాశం ఉందట.గెలుపు, సామాజిక అంశాలు, జిల్లా ప్రాతిపదికన కూర్పుకి అవకాశం ఉంటుంది.. జనసేన నుంచి కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, లకు ఆల్మోస్ట్ బెర్త్ల్ కన్ఫర్మ్ అని అంటున్నారు ఇటీవల వైసిపి నుంచి టిడిపిలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇవ్వకూడదన్న నిర్ణయానికి వస్తే మాత్రం పోటీ తగ్గే అవకాశం ఉంటుంది తప్ప లేదంటే పదవులు ఆశించే వారి సంఖ్య భారీగానే ఉంది. బిజెపి నుంచి సృజన చౌదరి, టీజీ భరత్ కు రాష్ట్ర మంత్రి వర్గం లో పక్కా ఛాన్స్ ఉందంటున్నారు. అలాగే జెయింట్స్ ని ఓడించిన వారికి ఇరుపార్టీలు వారు మంత్రివర్గంలో కచ్చితంగా ఛాన్స్ ఉందని చెప్తున్నారు. కుప్పం, పిఠాపురం స్థానాల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఓడించిన వాళ్ళను మంత్రులు చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు అదే తోవలో జగన్మోహన్ రెడ్డిని పులివెందులలో ఓడిస్తే బీటెక్ రవికి మంత్రి వర్గం లో చాన్స్ అంటున్నారు.. గతంలో కూడా ఎన్టీఆర్ ని కల్వకుర్తి లో ఓడించిన చిత్తరంజన్ దాస్ అలాగే లక్కీ చాన్స్ కొట్టేశారు. ఇక పదిమంది బీసీలను మంత్రులుగా చేస్తున్నామని వైఎస్ఆర్సిపి నేతలు ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు అయితే ఎవరు గెలవబోతున్నారు ఎవరు మంత్రులుగా అనే నేను…. అని ప్రమాణం చేయబోతున్నారో జూన్ మొదటి వారమే సమాధానం చెప్పనుంది.
previous post