ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతోంది. జనసేన మంత్రి వర్గం లో చేరడం కొత్తయినా బీజేపీ టీడీపీ కలసి 2014 లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.. ఇప్పుడు ఈ రెండు పార్టీ లతో పాటు మంత్రివర్గంలో జనసేన, భాగస్వామి కానుంది. గత కొద్ది రోజులుగా జనసేనాని ప్రభుత్వంలో చేరుతారా లేదా అనే ఒక సందిగ్ధత అయితే కొనసాగింది. దీని పైన పవన్ క్లారిటీ ఇచ్చారు. ఇక టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పార్టీ భాద్యతలు తీసుకుంటారన్న ప్రచారము జరిగింది.. ఇప్పుడు లోకేష్ కూడా ప్రభుత్వం లో కీలక భూమిక పోషించనున్నారు.. ఈ క్లారిటీ తో ఎన్నికల హామీల అమలు..మూడు పార్టీల సమన్వయం ఈ ఇద్దరికి అత్యంత కీలకంగా మారనుంది. జనసేన, బీజేపీ నుంచి మంత్రుల సంఖ్య, శాఖల పైన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.. 12న ముఖ్యమంత్రి గా చంద్రబాబు, పవన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారన్నది సమాచారం. టీడీపీ నుంచి 135 గెలవటం..అందునా గెలిచిన వారిలో సీనియర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం తో మంత్రుల ఎంపిక పైన చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. సామాజిక -ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. జనసేనకు నాలుగు మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. జనసేన నుంచి ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి,ఏ శాఖలు ఇవ్వాలనే దాని పైన ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారని కూడా తెలుస్తోంది.. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కు హోం – గ్రామీణాభివృద్ధి శాఖలు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్రంలో జనసేనకు మంత్రి పదవి దక్కకపోవటంతో ఏపీలో జనసేనకు 4-5 శాఖలు కేటాయించాలని పవన్ కోరినట్లు తెలుస్తోంది. ఇక నారా లోకేశ్ కు ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖలు ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే, ఈ సారి రాజధాని – యువతకు ఉపాధి కల్పన కీలకం కావటంతో ఈ శాఖలు కేటాయిస్తున్నట్లు కనిపిస్తోంది. అమరావతి నిర్మాణం సైతం పట్టణాభివృద్ధి పరిధిలోకి రానుంది. రాజధాని కోసం ప్రత్యేక సమయం కేటాయించాల్సి ఉండటంతో లోకేష్ వద్దే ఉంచుతారా లేక, గతంలో పర్యవేక్షించిన నారాయణకు తిరిగి అప్పగిస్తారా అనేదయితే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
previous post