ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో డబ్బు మద్యం పంపిణీ పై ప్రత్యేక నిఘా ఉంచిన ఎన్నికల కమిషన్ చేసిన పకడ్బందీ ఏర్పాట్లు సత్ఫలితాలనే ఇచ్చాయనే చెప్పొచ్చు.. అక్కడా.. ఇక్కడా అన్న తేడా లేకుండా చెక్ పోస్టులలో తనిఖీ లు నిర్వహించారు.. ఈ తనిఖీ లలో 107.96 కోట్లు నగదు పట్టుబడ్డట్టు ఎన్నికల కమీషన్ తెలిపింది. ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ కి చెందింది. మాత్రమే అని వివరించింది. మొత్తం 7,305 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లుఇసి ప్రకటించింది._సరిహద్దు ప్రాంతాల్లో 31 ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులతో సహా మొత్తం 150 చెక్‌పోస్టులు 35మొబైల్ బోర్డర్ పెట్రోలింగ్ పార్టీస్ ను అందుబాటులో ఉంచింది. వీటన్నింటితో పాటు 18 టెంపరరీ చెక్ పోస్ట్‌లను కూడా ఏర్పాటు చేసింది. 2019లో ఏపిలో పట్టుబడ్డ నగదు రూ.41.80 కోట్లు కాగా ఇప్పుడు ఆ మొత్తం భారీ గా పెరిగినట్లు తెలిపింది.ఇక మద్యం విషయానికి వస్తే… 2019 పట్టుబడ్డ అక్రమ మద్యం విలువ 8.07 కోట్లు కాగా ఈసారి పట్టుబడ్డ అక్రమ మద్యం విలువ రూ.58.70 కోట్లకు చేరింది అక్రమ మద్యం తరలిస్తున్న మొత్తం 61,543 మంది అరెస్ట్ చేసినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది
previous post
next post