భానుడు భగభగ మండుతున్నాడు. ఎప్పుడు లేనిది నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఋతుపవనాల రాక ఆలస్యం కావడంతో భానుడి విశ్వరూపం చూపిస్తున్నాడు. దీంతో ఎండలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు. వేడి గాలులు విజృంభిస్తున్నాయి. తీవ్ర ఉక్క పూత జనని ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. ఈ శనివారం విశాఖలో పరిస్థితి చాలా దారుణంగా మారింది. మూడు దశాబ్దాలు తర్వాత ఎన్నడూ లేని విధంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు ఆయన నగరంగా సరికొత్త రికార్డును నమోదు చేసింది. జూన్ 10 శనివారం నాడు విశాఖలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు వాల్తేరులో కూడా 43.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోధై ప్రత్యేకతను చాటుకుంది. ఇది సాధారణం కంటే ఏకంగా 11 డిగ్రీలు అధికం. విశాఖ లాంటి అధిక తేమ ఉన్న నగరంలో ఈ ఉష్ణోగ్రత ఫీల్ దాదాపుగా 55 డిగ్రీలా ఉంటుందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు 1995 జూన్ 9న విశాఖ ఎయిర్‌పోర్టులో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. ఇప్పటివరకూ ఈ నగర చరిత్రలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. 28 ఏళ్ల తర్వాత జూన్ నెలలో మళ్లీ అదే స్థాయిలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. విశాఖలో 44.6 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆ తరువాత కాకినాడలో 43.2 డిగ్రీలు, విజయవాడలో 43 డిగ్రీలు, తిరుపతిలో 42.2 డిగ్రీలు, నెల్లూరులో 41.6 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఏపీ తీర ప్రాంత ప్రజలు ఎండల కంటే ఉక్కపోత, వడగాలులకు సతమతం అయ్యారు. గత మూడు రోజులుగా గమనిస్తే విశాఖలో సరాసరిగా 42 డిగ్రీల ఎండ దంచికొట్టింది. సాధారణ ఉష్ణోగ్రతతో పోల్చితే 11 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదు కావడంతో విశాఖ ప్రజలు వేడి, ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సముద్ర తీర ప్రాంతం పక్కనే ఉన్న విశాఖలో అంత ఉష్ణోగ్రత అంటే అది దాదాపుగా 55 డిగ్రీలు లాగా ఉంటుంది. రుతుపవనాలు ఆలస్యం అయితే జరిగేది ఇది. గత పదేళ్లలో గమనిస్తే విశాఖలో ఉష్ణోగ్రత సరాసరి 7 డిగ్రీల మేర పెరిగింది. 2011లో గరిష్టంగా 37 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. 2012లో 37.4 డిగ్రీలు, 2013లో గరిష్టంగా 37 డిగ్రీలు, 2014లో తొలిసారి విశాఖలో 40 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదు అయింది. 2015లో 36.8 డిగ్రీలకే పరిమితమైంది. ఆపై 2016లో 36.2 డిగ్రీలు, 2017లో 35.6 డిగ్రీలు, 2018లో 39 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత, 2019లో 38 డిగ్రీలు, 2020లో 35.2 డిగ్రీలు, 2021లో 35.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా నేడు మాత్రం 44.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయి రికార్డు సృష్టించింది.