ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా విజయ్ మిల్టన్ దర్శకత్వంలోనిర్మిస్తున్న పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ తుఫాన్ టీజర్ ను విడుదల చేశారు. తనను చిన్న చూపు చూసే సమాజం భవితను మార్చిన ఓ వ్యక్తి కథ ఇది. ప్రస్తుతం తుఫాన్ చిత్రీకరణ తుది దశలో ఉన్న సినిమా షూటింగ్ ను అండమాన్, డయ్యూ డమన్ లలో జరిపారు. జూన్ లో థియేట్రికల్ రిలీజ్ కు రానున్న”తుఫాన్” సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో డైరెక్టర్ విజయ్ మిల్టన్ మాట్లాడుతూ తమిళ్ లో తెలుగు హీరోలకు, దర్శకులకు మంచి క్రేజ్ ఉంది. వారిని బాగా అభిమానిస్తారు. తెలుగు ఆడియెన్స్ అంటే నాకు అభిమానం. తెలుగులో ఒక సూపర్ హిట్ సినిమా రూపొందించాలనేది నా కల. వాళ్లు సినిమాను సెలబ్రేట్ చేసుకునే విధానం ఆకట్టుకుంటుంది. విజయ్ ఆంటోనీతో నాకు ఇరవై ఏళ్ల స్నేహం ఉంది. ఇంతకాలం నాతో ట్రావెల్ చేస్తున్నందుకు విజయ్ కు థ్యాంక్స్. “తుఫాన్” సినిమా కోసం రెండేళ్లుగా కష్టపడ్డాం. ఒక దీవిలో జరిగే కథ ఇది. ఒక అపరిచిత వ్యక్తి అపరిచిత సమాజంలోకి అడుగుపెట్టాక మొదలయ్యే స్టోరీ ఇది. అండమాన్ లో షూటింగ్ చేయాలని ప్లాన్ చేశాం. అక్కడ షూటింగ్ మేము అనుకున్నట్లు సాధ్యం కాలేదు. డామన్ అండ్ డయ్యూ, గోవాలో షూటింగ్ చేశాం. తుఫాన్ వచ్చే ముందు ఎలా ప్రశాంతంగా ఉంటుందో కథలో హీరో క్యారెక్టర్ అలా ఉంటుంది. ఈ టైటిల్ సజెస్ట్ చేసిన భాష్యశ్రీ గారికి థ్యాంక్స్. బిగ్ కాస్ట్ తో మీ ముందుకు వస్తున్నాం. “తుఫాన్” సినిమా మేకింగ్ లో నాకు సపోర్ట్ చేసిన మా కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్. అన్నారు. హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ – “తుఫాన్” యాక్షన్ ప్యాక్డ్ మూవీ. అన్ని వర్గాల ఆడియెన్స్ కు నచ్చుతుంది. మా ప్రొడ్యూసర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. మా డైరెక్టర్ విజయ్ మిల్టన్ సినిమాటోగ్రాఫర్ గా చాలా సినిమాలు చేశారు. తెలుగులో వచ్చిన ప్రేమిస్తే చిత్రానికి ఆయనే సినిమాటోగ్రాఫర్. విజయ్ తో కలిసి పనిచేయడ హ్యాపీగా ఉంది. భాష్యశ్రీ నాతో కంటిన్యూగా ట్రావెల్ అవుతున్నారు. ఈ సినిమా ఆయనకు కూడా మంచి పేరు తెస్తుంది. నిర్మాత వంశీ నందిపాటి నాతో బిచ్చగాడు 2 సినిమాకు అసోసియేట్ కాబోతున్నాడు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఆయనకు థ్యాంక్స్. సత్యరాజ్, శరత్ కుమార్, డాలీ ధనుంజయ వంటి చాలా మంది పేరున్న కాస్టింగ్ తో “తుఫాన్” మూవీ మీ ముందుకు రాబోతోంది. జూన్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నా. నేను ఇటీవల రివ్యూయర్స్ గురించి మాట్లాడిన మాటలు అందరినీ ఉద్దేశించి కాదు. సినిమా మా బేబి. మీ బేబిని ఎవరైనా తిడితే మీకు కోపం వచ్చినట్లే మేము కష్టపడి చేసిన సినిమాను విమర్శిస్తే కోపం వస్తుంది. ఒకరిద్దరు బ్యాడ్ ఇంటెన్షన్ తో ఇచ్చిన రివ్యూల వల్ల మా సినిమా కిల్ అవుతుందని చెప్పాం. అది పర్సనల్ గా జరిగిన అటాక్. సినిమా గురించి రివ్యూ చెప్పే రైట్ మీడియాకు ఉంది. ఆ స్వేచ్ఛను గౌరవిస్తాను. తెలుగులో ఇటీవల థియేట్రికల్ గా కొన్ని మూవీస్ ఆదరణ పొందలేదు. కానీ హనుమాన్, టిల్లు స్క్వేర్ సినిమాలు మంచి బాక్సాఫీస్ వసూళ్లను సాధించాయి. కంటెంట్ బాగుంటే తప్పకుండా ప్రేక్షకులు థియేటర్స్ కు వస్తారు. అన్నారు.