బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతోంది. దాని తీవ్రత క్రమంగా పెరిగి వాయుగుండం ఆ తర్వాత తీవ్రవాయుగండం గాను బలపడి మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారనున్నట్టు వాతావరణ శాఖ కీలక అప్డేట్ ని ఇచ్చింది. తుఫాన్‌గా మారితే ఒమన్ దేశం సూచించిన ‘రెమాల్’ గా నామకరణం చేస్తారు. ప్రస్తుతానికి ఈశాన్య దిశగా కదులుతు సుస్పష్టమైన అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడుతూ ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. వీటి ప్రభావం ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ తో పాటు బంగ్లాదేశ్ పైన ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు.ప్రస్తుతం అల్పపీడనం ప్రభావం అంతా మధ్య బంగాళాఖాతంలోనే ఎక్కువ. ఆ ప్రాంతంలోనే ఎక్కువ వర్షపాతం కురుస్తోంది. అల్పపీడనం ప్రభావంతో కోస్తాలో తేలిక పాటి వర్షాలకురుస్తాయని అంటున్నారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి సునంద. వాతావరణ శాఖ అధికారులు. భూభాగం పైనుంచి ఏపీ వైపు గాలుల్లో వేస్తున్న నేపథ్యంలో ఉష్ణోగ్రతలకు క్రమంగా పెరుగుతున్నాయని అంటున్నారు.ఇక అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మూడురోజులపాటు అక్కడక్కడా వర్షాలు పడతాయని వాతావరణశాఖ చెబుతుంది.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కేరళ, తమిళణాడు పరిసరాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.రానున్న రెండు, మూడు రోజుల వరకు వర్షాలు కొనసాగుతాయని నిపుణులు చెబుతున్నారు. మే 31న కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. అయితే కొందరు నిపుణులు ఒకరోజు ముందు అంటే 30వ తేదీన రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు.