నలబై కోట్లకు ‘తండెల్’ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్

నాగ చైతన్య(Naga chaitanya), సాయి పల్లవి(Sai pallavi) జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్(Allu aravind) సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న తండేల్ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ 40 కోట్లకు కొనుగోలు చేసిందిచందూ మొండేటి తో నాగచైతన్య మూడోసారి గ్రామీణ నేపథ్య ప్రేమకథ కోసం కలసి వెళ్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి భారీ బజ్ నడుస్తోంది. ఫస్ట్ లుక్, టీజర్, ఇతర ప్రోమోలకు కూడా మంచి ఆదరణ లభించింది. ఇంతలో ఈ సినిమా బిజినెస్ భారీ స్థాయిలో మొదలైంది. ప్రముఖ ఓటీటీ (OTT) ప్లాట్‌ఫామ్ (Netflix) అన్ని దక్షిణ భారతీయ మరియు హిందీ భాషల డిజిటల్ హక్కులను రూ. 40 కోట్లకు దక్కించుకుంది.. నాగ చైతన్య సినిమా కెరీర్ లో ఇదే అతిపెద్ద డిజిటల్ డీల్.నాగ చైతన్య బ్యాంకబుల్ స్టార్‌లలో ఒకరు అయితే, చందూ మొండేటి కార్తికేయ 2 భారీ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతే కాకుండా అతిపెద్ద నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించడం ఇలాంటి అంశాలన్నీ తండెల్‌ సినిమా కు ఇంత ఫాన్సీ ఆఫర్‌ని తీసుకొచ్చాయి. ప్రేమకథతో పాటు దేశభక్తి అంశాలు కూడా ఉంటాయని భావిస్తున్న ఈ చిత్రం లో నాగచైతన్య ఉత్తరాంధ్ర యాస తో మత్స్యకారుడి కనిపించనున్నట్టు టీజర్‌ స్పష్టం చేసింది.. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రానికి శామ్‌దత్ కెమెరామెన్ కాగా రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Related posts

నాలుగున్నర దశాబ్దాల అప్పటి పాన్ ఇండియా ‘శంకరాభరణం’

ఇండ‌స్ట్రీలో టాలెంట్‌తో పాటు, బిహేవియర్ కూడా ఉండాలి.. మెగాస్టార్ చిరంజీవి

గేమ్ ఛేంజర్ తో బాక్సాఫీస్ బద్దలైపోవాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More