మే 31న’ హరోం హర’ “గం..గం..

గణేశాసినిమా ఫెవరేట్ కాలమైన సమ్మర్ లో ఈసారి పెద్ద సినిమాల తాకిడి తగ్గడం తో చిన్న మధ్య తరహా సినిమాలన్నీ థియేటర్ల బాటపట్టాయి.. ఇంత కాలం కల్కి మే 30 న వస్తుందన్న ప్రచారం తో ఎప్పుడు రావాలా..? అని ఆలోచించుకుని కూర్చున్న చిన్న నిర్మాతలకు కల్కి విడుదల జూన్ కి మారడంతో ఒక్కసారిగా తమచిత్రాల విడుదల తేదీని అఫీషియల్ గా ప్రకటిస్తున్నారు.. సుబ్రహ్మణ్యుడి సంభవానికి ముహూర్తం సిద్ధం అయ్యిండాది అంటూ సూపర్ స్టార్ కృష్ణ జయంతి ని పురస్కరించుకుని వస్తున్నామని మేకర్స్ ప్రకటించారు.. అలాగే “బేబి” వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా” సినిమా రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. మే 31న “గం..గం..గణేశా” సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ దేవరకొండ తన కెరీర్ లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది కావడం విశేషం. రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. కొండ అంచున నిలబడి ఉన్న హీరో ఆనంద్ గన్ ఫైర్ చేసినప్పుడు ఆ గన్ నుంచి గులాబి రేకలు వస్తున్నట్లు పోస్టర్ డిజైన్ చేశారు. సరికొత్త కంటెంట్ తో ఈ సమ్మర్ లో అన్ని వర్గాల ఆడియెన్స్ ను “గం..గం..గణేశా” ఎంటర్ టైన్ చేయనుంది. వీటితో పాటు అఫీషియల్ ఎంనౌన్స్మెంట్ వచ్చిన మరో చిన్న చిత్రం ”మ్యూజిక్ షాప్ మూర్తి” అజయ్ ఘోష్ ప్రధానపాత్ర లో చాందినీ చౌదరి నటిస్తున్న ఈ చిన్న చిత్రం పై కూడా మంచి ఎక్సపెక్ట్టేషన్స్ ఉన్నాయి… ఇవే కాక మరికొన్ని సీనిమాలు మే31 నే వచ్చేందుకు రంగం సిద్ధం చెసుకుంటున్నాయి.. ఐపీఎల్ మ్యాచ్ లు, ఎన్నికల హడావిడి రెండూ అయిపోవడంతో ప్రేక్షకులు థియేటర్ల బాట పడతారని మేకర్స్ ఆ డేట్ ని ఫిక్స్ చెసుకుంటున్నారు. కంటెంట్ బాగుంటే జనాలకి నచ్చితే జూన్ 12న ఇండియన్2 వచ్చేవరకు బాక్సాఫీస్ కళకళ లాడుతుందని భావిస్తున్నారు.. మరికొంతమంది మేకర్స్ రిలీజ్ డేట్ ఎంనౌన్స్మెంట్ తో మే31 బిగ్ ఫ్రైడే కానుంది

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More