తెలంగాణ సంస్కృతిలోని భాగమైన ఒగ్గుకథ నేపథ్యంలో చిత్ర దర్శకుడు ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రంలో యేవమ్ హిందూ సంప్రదాయంలోని గ్రామ దైవాల గొప్పదనాన్ని ఒగ్గుకథ ద్వారా ఈ చిత్రంలో చూపించారు. ఒగ్గుకథను సినిమాలోముఖ్య అంశంగా చేర్చిన కమర్షియల్ సినిమా అని చెప్పొచ్చు. ఈ ఒగ్గుకథను కూడా రియల్‌గా ఒగ్గుకథలను పాడే ఒగ్గుకథ కళాకారుల చేతనే చెప్పించడం విశేషం. దర్శకుడు మాట్లాడుతూ ఈ ఒగ్గుకథ లోని గాఢతను, సన్నివేశంలోని సారాంశంను చెప్పించడంతో ప్రేక్షకులు కథలో ఇన్‌వాల్వ్ అవ్వడమే కాకుండా వారికి కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు మంచి స్పందన వస్తుంది. ఈ నెల 14న విడుదల కాబోతున్న ఈ చిత్రం అందని అలరిస్తుందనే నమ్మకం వుంది అన్నారు.ఈ చిత్రంలో చాందిని చౌదరిదిని చైదరి, వశిష్ట సింహా, భరత్‌రాజ్,ఆషు రెడ్డి ముఖ్యతారలు. ఈ చిత్రానికి నవదీప్, పవన్ గోపరాజు నిర్మాతలు. గోపరాజు రమణ, దేవిప్రసాద్, కల్పిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ ఎస్‌వీ విశ్వేశ్వర్, సంగీతం కీర్తన శేషు, నీలేష్ మందలపు అందిస్తున్నారు. సుజనా అడుసుమిల్లి ఎడిటర్‌గా, రాజు పెన్మెత్స ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.