‘ ఫిలింమేకర్స్ తమ కథలను చెప్పడానికి వీలుగా అన్నపూర్ణ స్టూడియోస్, క్యూబ్ సినిమా సంయుక్తంగా హైదరాబాద్‌లో ది ఎ ఎన్నార్ వర్చువల్ ప్రొడక్షన్ స్టేజ్‌ని ఏర్పాటు చేశాయి. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఐసీవీఎఫ్‌ఎక్స్ (ఇన్ కెమెరా విజువల్ ఎఫెక్ట్స్ ) వల్ల ఫిల్మ్ మేకర్స్ ప్రొడక్షన్ ప్రాసెస్‌ని సులభతరం చేయడానికి ఇది దోహద పడుతుందని నిర్వాహకులు చెపుతున్నారు. 2022 అక్టోబర్ నుంచి ఈ ప్రక్రియ పై వివిధ స్థాయిల్లో టెస్ట్ లను నిర్వహించి కొన్ని సినిమాలు, యాడ్స్, మ్యూజిక్ వీడియోలను కూడా షూట్ చేసిన సంస్థ అన్ని పరిశీలించాకే వర్క్ ఫ్లో సొల్యూషన్ నాణ్యత బావుందన్న నిర్ధారణ కు వచ్చిన తర్వాతే ఫిల్మ్ మేకర్స్ కి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. ఎలాంటి హద్దులూ లేకుండా ఫిల్మ్ మేకర్స్ తమ క్రియేటివ్ గోల్స్ అచీవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కటింగ్ ఎడ్జ్, హై బ్రైట్‌నెస్, 60 అడుగుల వెడల్పు, 20 అడుగులు ఎత్తు , 2.3 మిల్లీ మీటర్ల డాట్ పిచ్ (అల్ట్రా హై రెఫ్రెష్ రేట్, వైడ్ కలర్ గమట్) ఉన్న ఎల్‌ఈడీ వాల్ స్పాన్నింగ్ అందులో ఉంటాయి. వాటన్నిటికీ మించి ఆటో లెడ్ డిస్‌ప్లేలుంటాయి. రెడ్‌స్పై, పవర్‌ఫుల్ కస్టమ్ బిల్ట్ రెండరింగ్ సిస్టమ్స్, అన్‌రియల్ ఇంజిన్‌తో కాంప్లెక్స్ ఫొటో రియలిస్టిక్ వర్చువల్ లొకేషన్స్ ని రియల్ టైమ్ రెండరింగ్ చేయడం వంటివన్నీ పొందుపరిచామన్నారు వీటన్నిటినీ ఉపయోగించుకుని రియల్, వర్చువల్ ఎలిమెంట్స్ బ్లెండ్ చేసి ప్రపంచంలోని ఎలాంటి ప్రదేశానికైనా ఫిజికల్‌గా వెళ్లకుండా షూటింగ్ చేసుకోవచ్చు. తమ సృజనకు అనుగుణంగా వాతావరణాన్ని, లైటింగ్‌ని మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. చిత్ర నిర్మాణంలో మా బలం, అనుభవం, సాంకేతిక పరిజ్ఞానంలో క్యూబ్ కున్న అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని మేం చేతులు కలిపాం. సృజనాత్మక రంగంలో ఎలాంటి సరిహద్దులు లేకుండా తెరమీద ఆవిష్కరించడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నట్టు అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత అక్కినేని నాగార్జున చెప్పారు. ఫిల్మ్ మేకర్స్ కి అత్యంత అనువైన, హైలీ ఎఫిషియంట్, కాస్ట్ ఎఫెక్టివ్ మేనర్‌లో మేం ఈ వెసులుబాటు తీసుకొస్తున్నాం. కంటెంట్ ప్రొడక్షన్‌లో వర్చువల్ ప్రొడక్షన్ అనేది అత్యంత ప్రశంసనీయమైన అభ్యున్నతి. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానంలో మేం ముందంజలో ఉండటం చాలా ఆనందంగా ఉందని క్యూబ్ సినిమా కో ఫౌండర్ పంచపకేశన్ అన్నారు. ఏఎన్నార్ ప్రొడక్షన్ స్టేజ్ ఇండియన్ సినిమా భారతదేశంలో అత్యుత్తమమైన ప్రప్రథమమైన ఐసీవీఎఫ్‌ఎక్స్ పర్మనెంట్ స్టేజ్ ఇదేనని వివరించారు.