నిశ్చితార్థం జరిగి ఐదునెలలు దాటిపోయింది.. పెళ్లెప్పుడు..? అంటూ కొంతమంది.. పెళ్ళి రద్దు అంటూ మరికొంత మంది.. శర్వానంద్ కి హెల్త్ ఇష్యూ .. రకరకాల కధనాలు వండి వారుస్తున్న మీడియా కు.. ఫేక్ రూమర్లకు గట్టి సమాధానంగా పెళ్ళి డేట్ ని ఎనౌన్స్ చేశారు.. రక్షితరెడ్డి తో జూన్ 2 మరియు3 తేదీలలో వివాహం జరగనున్నట్టు ఒక ప్రకటన వచ్చింది.రాజస్థాన్ జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో అత్యంత ఘనం గా పెళ్ళి జరగబోతున్నట్టు సమాచారం. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రక్షిత రెడ్డి తో జరిగిన నిశ్చితార్థ వేడుకకు రామ్ చరణ్, ఉపాసన, సిద్ధార్థ్, అదితి తోపాటు మరి కొంతమంది సెలబ్రిటీలు హాజరయిన విషయం తెలిసిందే. అయితే ఎంగేజ్మెంట్ జరిగి దగ్గర దగ్గర ఐదు నెలలు అవ్వడం తో ఎంగేజ్మెంట్ ను బ్రేక్ చేస్తున్నారు అన్న వార్తలు బాగా వైరల్ చేశారు. ప్రస్తుతం శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఆ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న శర్వానంద్ ఆరోగ్యం పై కూడా వార్తలు రాసుకొచ్చారు. ఒప్పుకున్న ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత ఇరుకుటుంబాలు పెళ్ళికి ముహూర్తం పెట్టుకుంటారని ముహూర్తం పెట్టుకున్నాక దానిని అధికారికంగా త్వరలోనే ప్రకటిస్తామని శర్వానంద్ స్పష్టం చేసిన విషయం కూడా విదితమే. ఇప్పుడు పెళ్ళి పై స్పష్టత రావడంతో వదంతులకు చెక్ పడ్డట్టే. ఇక శర్వానంద్ చేసుకోబోతున్న రక్షితరెడ్డి అలిపిరి లో నక్సలైట్లు పెట్టిన మందు పాతర లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తో పాటు ప్రయాణించి ప్రమాదం లో గాయపడ్డ శ్రీ కాళహస్తి కి చెందిన నేత ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి మనుమరాలు.. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి గారి కుమార్తె.