స్టార్ మా లో కొత్త సీరియల్ “చిన్ని”

స్టార్ మా ప్రారంభించబోతున్న సరికొత్త సీరియల్ పేరు “చిన్ని”. తల్లి సెంటిమెంట్ నడిపించే ఒక కొత్త తరహా కథతో సిద్ధమైన ఓ అమ్మాయి కథ ఇది. జైలు లో పుట్టి, జైలు లోనే తల్లితోపాటు వుండి, అదే ప్రపంచం అనుకుని, అక్కడున్నవాళ్ళే తన బంధువులు అనుకుని పదేళ్లవరకు పెరిగిన చిన్ని తల్లిని వదిలి బయటి ప్రపంచానికి వస్తుంది. అమ్మని వదిలి.. అమ్మ ఇచ్చిన నమ్మకంతో బయటకి కదిలిన చిన్ని తరవాతి జీవితం ఎలా వుండబోతోంది? అసలు తల్లి జైలు లో ఎందుకు ఉండాల్సివచ్చింది? చిన్ని కి నీడనిచ్చేది ఎవరు? అసలు పరిచయం లేని ప్రపంచంలో చిన్ని ఎలా వుండబోతోంది? అమ్మ లేని చోట తనకి అంత ప్రేమ దక్కుతుందా? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ “చిన్ని” సీరియల్. తల్లీ కూతుళ్ళ మధ్య ప్రేమానుబంధాలు, భావోద్వేగాలకు “చిన్ని” సీరియల్ వేదిక కాబోతోంది. చిన్ని చూడని ఓ కొత్త ప్రపంచం ఆమెని ఎలా అక్కున చేర్చుకోబోతోందో, చిన్ని అక్కడ ఎన్ని సమస్యలు ఎదుర్కోబోతోందో.. తల్లి ఇచ్చిన ధైర్యంతో ఎవరికి ఎలా సమాధానం చెప్పి నెగ్గుకొస్తుందో.. మనకి చెబుతుంది “చిన్ని” కథ. స్టార్ మా లో “చిన్ని” సీరియల్ జులై 1 న ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7 గంటలకు ప్రసారం అవుతుంది.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More