కనుమరుగవుతున్న సింగిల్ స్క్రీన్లు..

స్టార్‌ హీరోల కటౌట్లతో కళకళలాడిన సినిమా థియేటర్లు నెమ్మదిగా కనుమరుగవుతున్నాయి. స్టార్ల కటౌట్ల స్థానంలో ఆఫర్ల హోర్డింగులు, శుభకార్యాల ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, అపార్ట్మెంట్లు దర్శనమిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని లోని పలు సింగిల్‌ థియేటర్లు ఒక్కొక్కటిగా మూతపడబోతున్నాయి. కరోనా వల్ల థియేటర్స్‌ పరిశ్రమకు పూర్తిస్థాయిలో దెబ్బ పడింది. ఆ సమయంలో ఓటిటి కి అలవాటు పడ్డ ప్రేక్షకులు కరోనా అనంతరం థియేటర్ ఓపెన్ చేసిన ఎవరు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. పెద్ద హీరోల సినిమాలో మినహాయిస్తే చిన్న సినిమాలకు అసలు టిక్కెట్లు తెగడమే గగనమైపోయింది. కానీ కోవిడ్‌ కంటే ముందు నుంచి కూడా సింగిల్‌ స్క్రీన్స్‌ పరిస్థితి బాలేదు. థియేటర్లు నిండకపోవడం, టికెట్‌ రేట్లు, రెంటల్‌ చార్జీలు, కరెంట్‌ బిల్లులు, యూఎఫ్‌ఓ (ప్రొజెక్టర్‌కి సంబంధించినవి) బిల్లులు ఈ లెక్కల్లో లాభం చూడటం గగనం అనే పరిస్థితులే థియేటర్లు మూసేద్దాం అనే నిర్ణయం వెనక బలమైన కారణం అని తెలిసింది. కరోనా వల్ల పరిస్థితి ఇంకా దారుణం అయింది. సినిమా పరిశ్రమ కోలుకోవాలని ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా థియేటర్ల యాజమాన్యాలకు ప్రకటించిన రాయితీలు కూడా థియేటర్ ల మనుగడును కాపాడ లేకపోయాయి. ఈ సింగిల్‌ స్క్రీన్స్‌ను ఫంక్షన్‌ హాలులా, సూపర్‌ మార్కెట్లలా, షాపింగ్‌ మాల్స్‌లా మారిపోతున్నాయి. థియేటర్లు మూతపడటానికి ప్రధాన కారణం గురించి థియేటర్‌ యాజమాన్యాల ప్రతినిదులు మాట్లాడుతూ లాభం లేకుండా ఏ వ్యాపారమూ చేయలేమని, గవర్నమెంట్‌ నుండి మాకు రావాల్సిన రాయితీలు అన్నీ ఇచ్చామంటున్నారు. కానీ, రావాల్సిన థియేటర్‌ మెయింటినెన్స్‌ ఛార్జీలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇంతవరకు ఒక్క రూపాయి చెల్లించలేదని అంటున్నారు. కరోనా కారణంగా సినిమాల ప్రొడక్షన్‌ తగ్గటం వంటి ఎన్నో కారణాలతో ఈ థియేటర్లు మూతపడుతున్నాయని అంటున్నారు. ఈ థియేటర్లన్నీ ప్రైమ్‌ ఏరియాల్లో ఉండటంతో వాటిని షాపింగ్‌ మాల్స్, రెస్టారెంట్లకు ఉపయోగించుకునే ఆలోచనలతో యాజమాన్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం విశాఖ సిటీలో అయితే సినిమా థియేటర్ల మనుగడ చాలా కష్టంగా ఉందనే చెప్పాలి. అయితే ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. విశాఖ సిటీలో అయితే ఇటీవల దగ్గుబాటి రామానాయుడు కుటుంబానికి చెందిన జ్యోతి థియేటర్ ను కూడా మూసేశారు. ఆ థియేటర్ ని పడగొట్టి అక్కడ అపార్ట్మెంట్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతకుముందే కంచరపాలెం ప్రాంతంలో పరమేశ్వరి థియేటర్ ని పూర్తిగా మూసేశారు. ఇక గతంలో అయితే సరస్వతి థియేటర్, పూర్ణ థియేటర్, సత్యనారాయణ థియేటర్, నవరంగ థియేటర్ ,రామకృష్ణ థియేటర్, ప్రభాత్ థియేటర్ , శ్రీకృష్ణ థియేటర్, లక్ష్మీ థియేటర్, గీత్, సంగీత్ థియేటర్లు, మనోరమ థియేటర్ లు ఇలా ఒక్కొక్కటిగా మూతబడ్డాయి. గాజువాక ప్రాంతంలో కూడా కొన్ని థియేటర్లు పూర్తిగా మూసేశారు. ఇక రూరల్ ప్రాంతాలలో అయితే చాలావరకు సినిమా థియేటర్లు కళ్యాణ మండపాలుగా, అపార్ట్మెంట్లుగా, రైస్ మిల్లులుగా మారిపోయాయి. సిటీలో అయితే లీలామహల్ థియేటర్ అలాగే వెంకటేశ్వర, శ్రీ వెంకటేశ్వర థియేటర్లు, మెలోడీ థియేటర్ గోకుల్ థియేటర్ లు కూడా నేడో రేపో మూతపడే అవకాశాలు ఉన్నాయి. జనం థియేటర్ ల దగ్గరకు రావడం పూర్తిగా రావడం మానేశారు. దీనికి ఓటిటి ఒక కారణం కాగా, ఆర్థిక మాన్యం కూడా మరొక కారణంగా కనిపిస్తుంది. కరోనా తర్వాత చాలామందికి సరైన ఉపాధి అవకాశాలు లేక చదువుకు తగ్గ ఉద్యోగాలు రాక అవకాశం మేరకు కుటుంబ పోషణ కోసం వచ్చిన పనులలో చేరిపోయి నెమ్మదిగా కుటుంబాన్ని ఈడుస్తున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ వచ్చే కొద్దిపాటి జీతం ఇంటి అవసరాలకు సరిపోని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో పెరిగిన టిక్కెట్ రేట్లు అలాగే అక్కడ తిను బండారాల ధరలకు చూసి అవాక్కవుతున్న జనం ధియేటర్లకు వెళ్లడం పూర్తిగా మానేశారు. ఇంటి దగ్గర ఉంటే టిక్కెట్లుకు పెట్టే డబ్బులు రెండు రోజులు ఇల్లు గడిచి పోవడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే పెద్ద హీరోల సినిమాలు అయితే మాత్రం థియేటర్లు ఆ నాలుగు ఐదు రోజులు కళకళలాడుతున్నాయి. ఒక్క స్టార్ హీరో సంవత్సరానికి ఒక సినిమా చేస్తూ ఉండటం వల్ల స్టార్ హీరో మరో సినిమా వచ్చేంతవరకు థియేటర్లను నష్టాలతో నడిపే అవకాశం కూడా ధియేటర్ యాజమన్యాలకు కనిపించడం లేదు. కొత్త హీరోలతో వచ్చే సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళ్ళిపోతున్నాయో ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది. కనీసం నెలకు ఒక స్టార్ హీరో సినిమా విడుదలయితే జనం ఆ హీరో సినిమా చూసేందుకు అయినా ధియేటర్ కి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది రిలీజ్ అయితే స్టార్ హీరో సినిమా మళ్లీ వచ్చే సంవత్సరం వరకు ఆ హీరో కొత్త సినిమా కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. అప్పటివరకు థియేటర్లను అలాగ ఖాళీగా ఉంచి నష్టపోవడం కంటే వాటిని అమ్మేయడం లేదా లీజుకు ఇచ్చేయడమే మంచిదని భావిస్తున్నారు. ఈ కారణంగా ఒక్క విశాఖలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా అదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పరిస్థితిలో థియేటర్లను నడిపించలేని పరిస్థితులు ఎదురు కావడంతో థియేటర్ యాజమాన్యాలు సింగల్ థియేటర్లను ఒక్కొక్కటిగా మూసి వేస్తూ వస్తున్నారు. మరికొన్ని సింగిల్ థియేటర్లు పూర్తిగా మూతపడే అవకాశాలు అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More