ప్రభుత్వ శాఖలు నుండి అనుమతులు పొందకుండా నేరెళ్ళ వలస గ్రామం సర్వే నెం:118/5A (పాత సర్వే నెం :49/1) లోని 278.95 ఎకరాలు లొ జరిగిన అక్రమ తవ్వకాలపై గనుల శాఖ స్పందించింది.. తవ్వకాలు చేపట్టిన ది భీమినిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కో-అపరేటివే బిల్డింగు సొసైటీ కి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎర్రమట్టి దిబ్బలను త్రవ్వుతూ విద్వంసం చేస్తున్న ప్రదేశం తీరప్రాంత క్రమబద్దీకరణ మండలి (CRZ) జోన్-1 సున్నితిమైన పరధిలోనికి వస్తుందని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ పిర్యాదు చేయడం తో ఎర్ర మట్టి దిబ్బలు లొ అక్రమ తవ్వకాలు విశాఖ జిల్లా మైనింగ్ అధికారులు ఈ చర్యలకు ఉపక్రమించారు.ఆంధ్ర ప్రదేశ్ మైనర్ మినరల్ కన్సెషన్ రూల్స్-1966ను ఉల్లంఘించి ఎర్రమట్టి దిబ్బలు లొ అక్రమ లే ఔట్ పనులలో భాగంగా రోడ్ల నిర్మాణం కోసం పూరించడానికి 39,454 క్యూబిక్ మీటర్ల కంకర ఉపయోగించారు అని గుర్తించిన మైనింగ్ అధికారులు పదిహేను రోజుల్లోగా వివరణ ఇవ్వాలని లేనిచో భీమినిపట్నం మ్యూచువల్ ఎయిడెడ్ కో-అపరేటివే బిల్డింగు సొసైటీ పై చట్ట పరంగా ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయ్యాలని షో కాజ్ నోటీసు జారీ చేసారు. ప్రపంచ స్ధాయిలో ప్రసిద్ద పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొంది మన వారసత్వ సంపదగా ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయి