సత్యభామ పేరు లొనే ఒక వైబ్రేషన్ ఉంది.. ఉమెన్ ఎంపవర్మెంట్ కి అది ప్రతీక..

సత్యభామ అనే పేరులోనే ఒక వైబ్రేషన్ ఉందని పారిజాతపహరణం సమయంలో శ్రీకృష్ణుడి వెంట ఉన్నది సత్యభామే నని ఆమె వెంట ఉంటే విజయం ఖాయమని హిందూపురం శాసనసభ్యుడు, నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు.. కాజల్ నటించిన సత్యభామ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో టీజర్ రిలీజ్ చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు.. సత్యభామఅనే పేరు వుమెన్ ఎంపవర్ మెంట్ కు ప్రతీకగా చెప్పుకోవాలన్నారు మహిళలు ఈ రోజు పురుషుల కంటే అన్ని రంగాల్లో ముందడటం సంతోషకరం. భగవంత్ కేసరిలో నేను బనో బేటీకో షేర్ అని అంటే కాజల్ సత్యభామ సినిమాతో బనో కాచీకో షేర్ అంటూ ఫైట్స్ చేసింది ఎలక్షన్ క్యాంపెయిన్ వల్ల 45 రోజులుగా కెమెరాను చూడలేదు. ఇన్ని రోజులు మిస్ అయిన ఆ సందడి అంతా ఈరోజు సత్యభామ ఈ‌వెంట్ లో చూస్తున్నాను.. ఉగాది పచ్చడిలా సినిమా ఇండస్ట్రీలోని అన్ని అనుభవాలు వీరికి తెలుసు. ఆ అనుభవంతోనే సత్యభామ సూపర్ హిట్ సినిమా చేశారని నమ్ముతున్నాను. ఆర్టిస్టులు వైవిధ్యమైన చిత్రాలు చేయాలి. కాజల్ సత్యభామతో ఆ ప్రయత్నం చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమ దేశంలోనే నెంబర్ వన్ ఇండస్ట్రీగా ఉందంటే అందుకు కారణం మనకున్న మంచి ప్రేక్షకులు. ఈ రోజు నారద జయంతి. నాన్నగారు అన్ని రకాల క్యారెక్టర్స్ చేశారు. ఒక్క నారదుడు తప్ప. నేను శ్రీనివాస కల్యాణం సినిమాలో నారదుడిగా నటించా. నాన్న గారు చేయని క్యారెక్టర్ ఒకటి నేను చేయడం సంతృప్తినిస్తుంటుంది. సత్యభామ ట్రైలర్ చాలా బాగుంది. కాజల్ ఒక ఫైర్ బ్రాండ్. అన్ని రకాల ఎమోషన్స్ చేయగల నటి. పాత్రల ఆత్మలోకి వెళ్లి మెప్పించగలదు. 16 ఏళ్లలో అనేక వైవిధ్యమైన పాత్రల్లో నటించింది. అన్నింటిలోకి పరకాయ ప్రవేశం చేసింది. వైవాహిక జీవితంలోకి వెళ్లి ఒక బిడ్డకు జన్మనిచ్చి మళ్లీ మా భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ కు పెళ్లయ్యాక సపోర్టింగ్ క్యారెక్టర్స్ కోసం అడుగుతుంటారు. ఆ టైప్ కాస్ట్ ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్. ఆమెకున్న ఎనర్జీకి హ్యాట్సాఫ్. మొదటి నుంచి ఆమె సినిమాలు చూస్తున్నాను. కాజల్ తో నటించాలని ఉండేది. కానీ ఎందుకో ఆ కాంబినేషన్ కుదరలేదు. భగవంత్ కేసరిలో మేము కలిసి పనిచేయడం ఒక మంచి ఎక్సీపిరియన్స్. భగవంత్ కేసరిలో కాజల్, ఈ సినిమాలో కాజల్ ఒక్కరేనా అనిపించేలా ఉంది. సత్యభామ సినిమాకు మంచి టీమ్ పనిచేశారు. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది. జూన్ 7న థియేటర్స్ లో చూడండి. అన్నారు.డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ కాజల్ అగర్వాల్ 15 ఏళ్లుగా స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఉండటం మామూలు విషయం కాదు. మా భగవంత్ కేసరి సినిమాతో ఆమె కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యింది. మరో 15 ఏళ్లు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా. పోలీస్ క్యారెక్టర్స్ కొందరు హీరోయిన్స్ కే సూట్ అవుతాయి. అప్పట్లో విజయశాంతి గారిలా ఇప్పుడు కాజల్ కు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ బాగా సెట్ అయ్యింది. ఆమె యూనిఫామ్ లో కూడా చాలా బాగున్నారు. కాజల్ ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సులు చేసింది. బాలకృష్ణ గారు 45 డిగ్రీల ఎండల్లో హిందూపూర్ లో ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. ఆయనకు ఫోన్ చేస్తే షూటింగ్ కు రెడీ అన్నారు. అదీ ఆయన ఎనర్జీ. భగవంత్ కేసరిలో పోలీస్ ఆఫీసర్ గా బాలకృష్ణ గారిని చూపించాను. మళ్లీ అ‌వకాశం వస్తే పోలీస్ క్యారెక్టర్ లో ఆయనలోని పూర్తి ఎనర్జీని చూపిస్తాను. సత్యభామ బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నన్నారు.హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ – సత్యభామ సినిమా ట్రైలర్ బాలకృష్ణ గారి చేతుల మీదుగా రిలీజ్ కావడం సంతోషంగా ఉంది. నేను లైఫ్ లో మరో ఫేజ్ లోకి అడుగుపెట్టిన టైమ్ లో భగవంత్ కేసరి సినిమాలో నటించాను. అప్పుడు బాలకృష్ణ గారు ఇచ్చిన సపోర్ట్ తో నాకు ఎంతో కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆయన లవ్ అన్ కండిషనల్, ఎనర్జీ అన్ మ్యాచబుల్, బాలకృష్ణ గారు అన్ స్టాపబుల్. అనిల్ రావిపూడి నాకు మంచి ఫ్రెండ్. సత్యభామ కథను శశి తన టీమ్ తో వచ్చి చెప్పారు. నాకు చాలా ఎమోషనల్ గా అనిపించింది. వెంటనే ఓకే చెప్పాను. ఈ కథ మీద ఉన్న నమ్మకం గ్లింప్స్ చూసినప్పుడు రెట్టింపు అయ్యింది. టాలెంటెడ్ టీమ్ మా మూవీకి పనిచేశారు. నా కోస్టార్ నవీన్ చంద్రకు థ్యాంక్స్ చెబుతున్నా. అమర్ గా నవీన్ చంద్ర కంటే మరొకరు బాగా నటించలేరేమో. నవీన్ చంద్రతో మరోసారి కలిసి పనిచేయాలని ఆశిస్తున్నా. సత్యభామలో ప్రకాష్ రాజ్ తో మరోసారి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. శశి వల్లే నేను సత్యభామగా మారాను. తెలుగు ఆడియెన్స్ నన్ను స్టార్ హీరోయిన్ ను చేశారు. ఇన్నేళ్లుగా నాకు మీ లవ్ అండ్ సపోర్ట్ ఇస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్స్. సత్యభామకు కూడా మీ లవ్ అందిస్తారని ఆశిస్తున్నా. అన్నారు.దర్శకుడు సుమన్ చిక్కాల మాట్లాడుతూ – యుద్ధంలో కృష్ణుడి కోసం సత్యభామ ఫైట్ చేసింది. ఈ రోజు సత్యభామ ఈవెంట్ కోసం ఈ బాలకృష్ణుడు అతిథిగా వచ్చారు. దశాబ్దాలుగా ఆయన హీరోగా మనల్ని అలరిస్తున్నారు. ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేస్తున్నారు. బాలకృష్ణ గారు మూడోసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా అడ్వాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నా. చాలా మంది లెగసీని ఆస్తులుగా తీసుకుంటారు. కానీ బాలకృష్ణ గారు ఛారిటీని లెగసీగా తీసుకున్నారు. బసవతారకం ఆస్పత్రి ద్వారా ఎంతోమంది పేదలకు వైద్య సహాయం అందిస్తున్నారు. దర్శకుడిగా నా ఫస్ట్ హీరో కాజల్ గారు. ఆమె 60 సినిమాల్లో నటించారు. ఎంతోమంది లెజెండ్స్ తో కలిసి పనిచేశారు. అయినా నాకు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చారు. ఒకవైపు శంకర్ గారితో భారతీయుడు 2 చేస్తూ నా డైరెక్షన్ లో సత్యభామ మూవీలో నటించారు. మనం ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలనే విషయం కాజల్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నా. నా మొదటి హీరోగా ఆమెను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. అన్నారు.నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి, హీరో నవీన్ చంద్ర, చిత్ర సమర్పకులు, స్క్రీన్ ప్లే రైటర్ శశికిరణ్ తిక్క తదితరులు మాట్లాడారు.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More