రాజ్ తరుణ్, హాసిని సుధీర్ హీరో హీరోయిన్లు గా రాంభీమన దర్శకత్వంలో శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మిస్తున్న పురుషోత్తముడు టీజర్ ను హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ దర్శకుడితో పర్ఫెక్ట్ సింక్ తో సీన్ ఎలా ఉండాలో కన్వే చేసుకునేవాళ్లం. రేపు పెద్ద డైరెక్టర్ అయ్యాక కూడా నాతో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాఅన్నారు.. రాజా రవీంద్ర మాట్లాడుతూ – డైరెక్టర్ రామ్ భీమన గారు నాకు ఈ కథ చెప్పినప్పుడు ఇంప్రెస్ అయ్యాను. షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా డైరెక్టర్ చాలా కూల్ గా ఉండేవారు. మార్నింగ్ ఎలా ఉండేవారు సాయంత్రం వరకు అదే ఎనర్జీతో వర్క్ చేశారు. చాలా పెద్ద ప్యాడింగ్ ఈ మూవీలో ఉంది. సినిమా తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. అన్నారు. దర్శకుడు రామ్ భీమన మాట్లాడుతూ – ఒక సినిమా అనేక ఇబ్బందులు దాటుకుని రిలీజ్ వరకు రావడం సంతోషకరమైన విషయం. మా మూవీ టీజర్ లాంఛ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. కరోనా లాంటి పాండమిక్ మాలాంటి అప్ కమింగ్ రైటర్స్, డైరెక్టర్స్ ను చాలా ఇబ్బందిపెట్టింది. రెండు సినిమాలు చేసి మూడో సినిమా పెద్ద కాన్వాస్ లో డిజైన్ చేసుకున్నప్పుడు పాండమిక్ వచ్చి మొత్తం మార్చేసింది. అలాంటి టైమ్ లో కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు..ఇద్దరు గంధర్వుల్లాంటి ప్రొడ్యూసర్స్ రమేష్ గారు, ప్రకాష్ గారు వచ్చారు. నాకు వాళ్లు ఇంద్రుడు, చంద్రుడు. నిర్మాతలకు నాలుగు కథలు చెబితే మంచి టేస్ట్ తో ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్లు సినిమాకు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. బడ్జెట్ గురించి ఆలోచించలేదు. అడిగిన పెద్ద ఆర్టిస్టులను ఇచ్చారు. గోపీసుందర్, పీజీ విందా, మార్తాండ్ కె వెంకటేష్ ఇలా..ఒక్కొక్కరు మా టీమ్ కు యాడ్ అవుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. రాజ్ తరుణ్ తో పనిచేసి ఆయనకు ఫ్యాన్ అయ్యా. మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు గానీ హీరోయిన్ తో రాజ్ తరుణ్ కెమిస్ట్రీ కంటే సెట్ లో రాజ్ తరణ్ తో నా కెమిస్ట్రీ ఎక్కువగా ఉండేది. రాజ్ తరుణ్ గారిని కొత్తగా తెరపై ప్రెజెంట్ చేసే చిత్రమిది. మీకు ప్రామిస్ చేస్తున్నా పురుషోత్తముడుతో ఒక ఐ ఫీస్ట్ లాంటి సినిమాను చూడబోతున్నారు. అన్నారు. ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రమ్య కృష్ణ, బ్రహ్మానందం, ముకేష్ ఖన్నా వంటి స్టార్ కాస్టింగ్ తో రూపొందిన ఈ సినిమా త్వరలో థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.