ట్రైలర్ విడుదల చేసిన చిత్ర యూనిట్ బేబీ కధ నాదేనంటూ ఏకం గా విట్నెస్ లతో ఒక బుక్ రిలీజ్ చేసి బేబీ దర్శకుడు సాయి రాజేష్ పై తీవ్ర ఆరోపణలు చేరిన శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా ప్రేమించొద్దు ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేసారు..బస్తీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ ప్రేమ కథాంశమిది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ని జూన్ 7న విడుదల చేస్తున్నారు.ఆ తర్వాత, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయటానికి కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా ఆదివారం నాడు మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. తెలిసీ తెలియని వయసులో ప్రేమించొద్దు అనే కాన్సెప్ట్‌తో రియల్ ఇన్సిడెంట్‌ల ఆధారంగా ఈ మూవీని రా అండ్ రస్టిక్‌గా తెరకెక్కించారని తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోందిస్కూల్, కాలేజ్ ఏజ్ లవ్ స్టోరీలు, ప్రేమ అంటూ చదువుల్ని నిర్లక్ష్యం చేయడం, తెలిసీ తెలియని వయసులో ప్రేమిస్తే ఎదురయ్యే పరిణామాలను చూపించారు.ఇక ట్రైలర్‌లోని విజువల్స్, డైలాగ్స్ ఎంతో నేచురల్‌గా ఉన్నాయి. సమాజాన్ని తట్టిలేపేలా ఈ చిత్రం ఉంటుందని మేకర్స్ అంటున్నారు.