రక్షిత్ అట్లూరి హీరోగా రాధికా శరత్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా “ఆపరేషన్ రావణ్” వారం రోజుల ముందుగా ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య తెలుగు మరియు తమిళ బాషల్లో రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన “ఆపరేషన్ రావణ్” ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. “ఆపరేషన్ రావణ్” సినిమాలో రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, తమిళ నటుడు విద్యా సాగర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా విజయంపై మూవీ టీమ్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.