ఒక్క సినిమా మార్చేసింది.. ప్లానింగ్ మామూలుగా లేదుగా..

ఏక్షన్ ఎంటర్టైన్మెంట్ కధల చుట్టూ అన్ని రేంజ్ ల హీరోలు పడిగాపులు పడుతున్న టైమ్ లో వరుసపెట్టి విభిన్న కధలు చేస్తున్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క నిఖిల్ సిద్ధార్థ మాత్రమే.. ఒక్క సినిమా హిట్టయితే చాలు చాక్లెట్ బాయ్ లాంటి హీరో కూడా నెక్స్ట్ సినిమా మంచి ఏక్షన్ మూవీ చెయ్యాలని ప్లాన్ చేస్తున్న టైంలో అలాంటి థింకింగ్ కి భిన్నంగా నిఖిల్ చేస్తున్న లైనప్ చూసి చాలామందికి బుర్రపాడయిపోతుంది.. ఎనౌన్స్ చీతున్న ప్రతి చిత్రం ప్యాన్ ఇండియా రేంజ్ కు తగ్గకుండా పక్కాగా చేసుకుంటున్న ప్లాన్ చూసి షాక్ అవుతున్నారు.. ఈ ప్లానింగ్ వెనుక కార్తికేయ2 విజయమే కారణమని బాలీవుడ్ లో పెద్ద పెద్ద చిత్రాలు కూడా బొక్కబోర్లా పడుతున్న టైం లో కార్తికేయ2 నార్త్ సర్కిల్ లో భారీ విజయాన్ని అందుకోవడం అక్కడ నిఖిల్ కి మార్కెట్ తో పాటు ఫాన్స్ కూడా క్రియేట్ అవ్వడం తో ప్లానింగ్ అంతా నార్త్ ని దృష్టిలో పెట్టుకునే సినిమాల ఎంపిక చేసుకుంటున్నాడని తెలుస్తోంది.. కార్తికేయ 2 భారీ విజయం తరువాత సైలెంట్ గా వచ్చిన 18పేజెస్ ని ఎక్కడా ప్రమోట్ చెయ్యకుండా జాగ్రత్త పడ్డాడు.. స్పై టీజర్ విడుదల సమయంలో కూడా కార్తికేయ సక్సెస్ తరువాత వస్తున్న చిత్రం గానే కటింగ్ ఇవ్వడం నిఖిల్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఇమేజ్ ఏంటో తేటతెల్లం అయింది.. తాజాగా విడుదల చేసిన స్వయంభు పోస్టర్ తో వాటి అంచనాలు పెరిగిపోయాయి.. దీనికి బడ్జెట్ కూడా భారీగా పెట్టబోతున్నట్టు సమాచారం. అలాగే రామ్ చరణ్ సమర్పణలో అనౌన్స్ చేసిన ది ఇండియా గేట్ కూడా పరిశ్రమ వర్గాల్లోనే కాకుండా పొలిటికల్ సర్కిల్స్ లో కూడా చర్చ ను రాజేసింది. అలాగే రాబోతున్న స్పై చిత్రం పై టాలీవుడ్ ఆడియన్స్ తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆశక్తి గా ఉన్నారట.. సుభాష్ చంద్ర బోస్ అంతర్ధానం గురించి రూపొందించిన సినిమా కావడంతో నార్త్ బయ్యర్స్ నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయట. ఇప్పటికే ఎనిమిది కోట్ల పారితోషకం డిమాండ్ చేస్తున్న నిఖిల్

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More