లిటిల్ బేబీస్ క్రియేషన్స్ పతాకంపై నోరి నాగ ప్రసాద్ నిర్మాతగా, దర్శకుడు హరీష్ చావా రూపొందిస్తున్న చిత్రం “ఇట్లు… మీ సినిమా”. అభిరామ్, వెన్నెల, మనోహర్, పవన్, కృష్ణ, మంజుల హీరో హీరోయిన్లుగా, ప్రదీప్, అమ్మ రమేష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. నలుగురు యువకులు తమకున్న ప్యాషన్ తో, సినిమా రంగానికి వచ్చి వాళ్లు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి, వాళ్ళు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారా లేదా అనే కథాంశంతో లవ్, రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్ కలగలిసి ఈ చిత్రాన్ని రూపొందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ఇట్లు… మీ సినిమా” ఈనెల 21న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలోదర్శక నిర్మాత నాగబాల సురేష్ దర్శకుడు రేలంగి నరసింహారావు,దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ,దర్శకుడు సముద్ర,
నిర్మాత టి.ప్రసన్నకుమార్, నిర్మాత సాయివెంకట్,
దర్శకుడు హరీష్ చావా, నిర్మాత నోరి నాగ ప్రసా,ద్ బాలరాజు, .
నటి మంజుల, హీరోయిన్ వెన్నెల, హీరో అభిరామ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.