ఆంద్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో నిర్మాత నట్టికుమార్ వివిధ రాష్ట్రాల నుంచే కాదు ప్రంపంచం నలుమూలల నుంచి కూటమిని ఆశీర్వదించడానికి రాష్ట్రానికి ప్రత్యేకంగా తరలివచ్చిన ప్రజలందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతూ విడుదల చేసిన ఓ ప్రకటన లో మొన్నమొన్నటి వరకు మెగా హీరో గా ఉండి ఇప్పుడు ఒన్ ఐటెంటీటీ సంపాదించుకుంటున్న ఓ హీరో పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మెగా ఫ్యామిలీ అన్నది ఒక మహావృక్షం లాంటిది. చిరంజీవి అనే ఆ మహావృక్షం నుంచే ఎవరైనా ఎదుగుతూ వచ్చి ఈ రోజు స్టార్ హీరోలయ్యారు. ఈ రోజు రెక్కలు వచ్చి, వారు ఎంత ఎత్హుకు ఎదిగినా ఆ మహావృక్షమే కారణమని మరచిపోకూడదు. ఆ నీడలో పెరిగి పేరు సంపాదించుకున్న ఒకరు కొణిదెల ఫ్యామిలీకి వ్యతిరేకంగా ప్రవర్తించినంత మాత్రాన పోయేదేమీ లేదు. కాకపోతే నా అభిప్రాయం ప్రకారం అది ఎంతమాత్రం కరెక్ట్ కాదని అన్నారు. అదే ప్రకటన లో కొణిదెల ఫ్యామిలీకి కానీ పవన్ కల్యాణ్ కు కానీ వచ్చిన నష్టమేమీ లేదు. జూన్ 4న కూటమి అభ్యర్థులతో పాటు పవన్ కల్యాణ్ ను ప్రజల ఆశీర్వాదములతో మంచి పొజిషన్ లో మనం చూడబోతున్నాం” అంటూ నట్టి కుమార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నట్టి కుమార్ ఇంత సూటిగా కామెంట్స్ ఎందుకు చెయ్యాల్సి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ విజయాన్ని కోరుకుంటూ కేవలం ట్వీట్ తో సరిపెట్టి నంద్యాల అభ్యర్థి తన మిత్రుడు అంటూ వైసీపీ ప్రచారానికి వెళ్లడం పై జనసైనికులు తీవ్ర ఆగ్రహం తో వున్నారు.. ప్రత్యక్షంగా ప్రచారానికి వెళ్లకపోయిన ఓటర్లు అటెన్షన్ గ్రాబ్ చెయ్యడానికి చేసిన ప్రదర్శన గానే భావించాల్సి వస్తుందని జనసేన పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు.. వారి అభిప్రాయాన్నే నట్టికుమార్ తన ప్రకటన ద్వారా వెల్లడించినట్లు చెప్తున్నారు..