టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వైవిఎస్ చౌదరి. ఆయన నుండి సినిమా వచ్చి చాలా కాలం అవుతుంది. అయితే, ఇప్పుడు ఆయన తిరిగి సినిమాల్లో యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. తాజాగా నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు ని పురస్కరించుకుని దీనికి సంబంధించిన ఓ అనౌన్స్ మెంట్ కూడా చేశారు.తన భార్య గీత యలమంచిలి నిర్మాతగా ఓ ప్రొడక్షన్ హౌజ్ ను వైవిఎస్ చౌదరి స్టార్ట్ చేశారు. న్యూ టాలెంట్ రోర్స్(NTR) అన్న క్యాప్షన్ తో ముందుకొస్తున్నారు.. వైవిఎస్ చౌదరి సతీసమేతంగా ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి, అక్కడ నందమూరి తారక రామారావుకు తమ నివాళి అర్పించిన అనంతరం తమ నూతన ప్రొడక్షన్ హౌజ్ కు ఆయన ఆశీస్సులు ఉండాలని వారు కోరారు.కాగా, తమ ప్రొడక్షన్ హౌజ్ నుంచి రాబోయే తొలి సినిమాలో నందమూరి జానకి రామ్ తనయుడు నందమూరి తారక రామారావును సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా లో ఒక తెలుగు అమ్మాయి ని కూడా హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేయనున్నట్లు చెప్పారు. షూటింగ్ ను అతి త్వరలో పట్టాలెక్కించేందుకు వైవిఎస్ చౌదరి రెడీ అవుతున్నారు.