మార్చి 27న మోహన్ లాల్ ‘L2 ఎంపురాన్’ వ‌ర‌ల్డ్ వైడ్ రిలీజ్

‘లూసిఫర్’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘L2 ఎంపురాన్’ వ‌చ్చే ఏడాది మార్చి 27న ‘L2 ఎంపురాన్’ చిత్రం తెలుగు, మ‌ల‌యాళం, త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ కానుంది. స్టార్ హీరోల‌తో భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మించే లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్‌లాల్ హీరోగా రాబోతోన్న ఈ చిత్రంలో సౌత్ స్టార్‌లు నటిస్తున్నారు. లూసిఫర్ హిట్ కావ‌టంతో సినిమాపై ఎలాంటి అంచ‌నాలున్నాయో ముందుగానే అంచ‌నా వేసిన మేక‌ర్స్ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మించేలా సినిమాను నిర్మిస్తున్నారు. మోహ‌న్ లాల్‌, వెర్స‌టైల్ యాక్ట‌ర్‌, డైరెక్ట‌ర్ పృథ్వీరాజ్ సుకుమార్ కాంబినేష‌న్‌లో రానున్న మూడో చిత్రం కావ‌టంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశన్నంటాయి. మోహ‌న్‌లాల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘L2 ఎంపురాన్’ లో ఖురేషి అబ్ర‌మ్‌గా సూప‌ర్‌స్టార్ లుక్‌ను … అలాగే పృథ్వీరాజ్ సుకుమార్ పోషిస్తోన్న క్యారెక్ట‌ర్ జయేద్ మసూద్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేయ‌గా అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చిన ఈ చిత్రంలో టోవినో థామ‌స్‌, మంజు వారియ‌ర్‌, నందు, సానియా అయ్య‌ప్ప‌న్ త‌దిత‌రులు మ‌రోసారి వారి పాత్ర‌ల‌తో మెప్పించ‌ బోతున్నారు. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించారు.
‘L2 ఎంపురాన్’ రిలీజ్ డేట్‌ను తెలియ‌జేస్తూ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More