యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ “క” బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్న “క” సినిమా తెచ్చుకుంటున్న రెస్పాన్స్ డే 1 వసూళ్లలో ఆడియన్స్ రెస్పాన్స్ స్పష్టమవుతోందంటు మేకర్స్ కలెక్షన్ పోస్టర్ విడుదల చేసారు. 6.18 కోట్ల రూపాయల డే 1 కలెక్షన్స్ ను కొనసాగిస్తూ రెండో రోజు బుకింగ్స్ ర్యాంపేజ్ కొనసాగుతోంది. ఈ ట్రెండ్ చూస్తుంటే “క” ఫస్ట్ వీక్ హ్యూజ్ కలెక్షన్స్ సాదించే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్. ఓ సరికొత్త థ్రిల్లర్ మూవీని చూశామనే ప్రశంసలు దక్కించుకుంటున్న “క” కిరణ్ అబ్బవరం పర్ ఫార్మెన్స్ హైలైట్ అవుతోంది. రాధగా తన్వీరామ్, సత్యభామగా నయన్ సారిక అప్రిషియేషన్స్ అందుకుంటున్నారు. ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసే ట్విస్టులతో దర్శకులు సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించి తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని అందుకున్నారు. “క” సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు.