విజయసాయి రెడ్డి పై సంచలన ఆరోపణలు
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం మారిన దగ్గర నుంచి చిత్ర విచిత్రా లెన్నో జరుగుతున్నాయి.. ప్రజా ప్రతినిధులు, అధికారులు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.. స్కాములు, అరాచకాలు, దౌర్జన్యాలు, వీటిపై ప్రజలు గొంతు విప్పుతుంటే ఏకంగా ఓ అధికారిపై ఆమె భర్త దేవాదాయ కమీషనర్ కి లేఖ రాయడం రాష్ట్రం లో సంచలనం సృష్టించింది.. ఆయన రాసిన లేఖ వైరల్ అవ్వడం తో రాష్ట్రాన్ని ఓ వూపు వూపేస్తుంది.. నెల్లూరు నుంచి లోక్ సభ కు ఎంపీ గా పోటీ చేసిన రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి పై ఆరోపణలు గుప్పిస్తూ దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మదన్ మోహన్ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ లెటర్ రాసారని ప్రచారం జరుగుతుంది.. వ్యక్తిగత పిర్యాదు కావడం వల్లనో ఇతర కారణాల వల్లనో రాసిన లేఖ మాత్రం ఒక తెల్లకాగితం పైనే వుంది. మదన్ మోహన్ కూడ తెలంగాణ ప్రభుత్వం లో కీలకమైన పోస్ట్ లో వున్నప్పటికీ లెటర్ పాడ్ పై ఆ లేఖ రాయకపోవడం గమనార్హం. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భం దాల్చిందని తన భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ లే కారణమనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ భర్త మదన్ మోహన్ కంప్లైంట్. తన భార్య అక్రమ సంతానానికి తండ్రెవరో తేల్చాలంటూ దేవదాయ శాఖ కమిషనరును కోరుతూ లేఖ రాశారని ప్రచారం జరుగుతుంది ఇటీవలే శాంతిని సస్పెండ్ చేసిన దేవదాయ శాఖ కమిషనర్. నెట్టింట్లో వైరల్ అయిన ఈ లేఖ దేవదాయ శాఖలో కూడా సంచలనంగా మారింది .