ఎల్పీజీ పై భారీ తగ్గింపు

త్వరలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న సమయంలో కేంద్రం ఎల్పీజీ వినియోగదారులపై కనికరం చూపింది.. కాంగ్రెస్ పదే పదే గ్యాస్ రేట్ గురించి ప్రస్తావిస్తున్న సందర్భం లో ఎవరూ ఊహించని విధంగా గ్యాస్ ధరలను తగ్గించింది తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ ఈ నిర్ణయం తీసుకోవడం బీజేపీ కి బాగా కలిసొచ్చే అంశం..ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్‌లో 200 రూపాయలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. రక్షాబంధన్‌ మలయాళీల పండుగ ఓనమ్ ను పురస్కరించుకుని ఈ రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.ఇంట్లో వినియోగించే వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర ప్రస్తుతం దేశ రాజధాని దిల్లీలో రూ.1103గా ఉంది. తగ్గించిన తర్వాత రూ.903కి తగ్గనుంది. ఉజ్వల పథకం కింద వంట గ్యాస్‌ పొందిన వారికి సబ్సిడీ కింద రూ.200 ఇస్తుండగా.. తగ్గింపుతో వారికి రూ.400 మేర ప్రయోజనం చేకూరనుంది. అంటే వారికి గ్యాస్‌ సిలిండర్ రూ.703కే లభించనుంది. అలాగే, ఉజ్వల పథకం కింద కొత్తగా మరో 75 లక్షల కొత్త వంట గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. 2016లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. కొత్తగా ఇవ్వనున్న కనెక్షన్లతో కలిపితే ఈ లబ్ధిదారుల సంఖ్య 10.35 కోట్లకు చేరనుంది.. కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పలుమార్లు సవరించిన ఆయిల్‌ కంపెనీలు.. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్‌ ధరను మాత్రం స్థిరంగా ఉంచాయి. చివరిసారిగా ఈ ఏడాది మార్చిలో ఒక్కో సిలిండర్‌పై రూ.50 చొప్పున ఆయిల్‌ కంపెనీలు పెంచాయి.⁰ĺpp

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

మంగ్లీకి బిస్మిల్లా ఖాన్ గౌరవపురస్కారం

మొదలైన సినిమాటిక్ ఎక్స్పో

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More