‘కన్నప్ప’.. విల్లు విశేషాలు

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ టీజర్ అన్ని వర్గాల ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. ఇక తాజాగా విష్ణు తన కన్నప్ప సినిమాలో భాగంగా వాడిన విల్లు విశిష్టతను గురించి చెప్పుకొచ్చారు. ‘కన్నప్ప’లో తిన్నడు వాడిన విల్లు కేవలం ఆయుధం మాత్రమే కాదని ఆ ధనస్సు ధైర్యానికి…, తండ్రీకొడుకుల మధ్య బంధానికి సూచిక కన్నప్ప తండ్రి నాధనాథ తన చేతుల్తో తయారు చేసిన ఆ విల్లు కుటుంబ వారసత్వం ఆ విల్లుతో కన్నప్ప యుద్ధభూమిలో అసమానమైన బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తారు. ఐదేళ్ల వయసున్నప్పుడే అడవిలో క్రూరమైన పులిని సాధారణ కర్రతో పోరాటం చేసి ఆ పులి నుంచి తప్పించుకుంటాడు. అంత చిన్న వయసులో తన కొడుకు ధైర్య సాహసాల్ని చూసిన నాధనాథుడు కన్నప్ప శౌర్యానికి ప్రతీకగా పులి ఎముకలు, దంతాలతో చేసిన ఆ విల్లు బలానికి, ధైర్య సాహసాలకి ప్రతీకగా నిలుస్తుంది. ఆ విల్లుని రెండుగా విరిస్తే పోరాడేందుకు కత్తుల్లానూ ఉపయోగపడేలా రూపొందించారు. మంచు విష్ణు చెప్పిన కథను శ్రద్దగా విన్న న్యూజిలాండ్‌లోని చిత్ర కళా దర్శకుడు క్రిస్ ఈ ప్రత్యేకమైన విల్లుని తయారు చేశారు. కన్నప్ప సినిమా విజన్‌కు అనుగుణంగా, విష్ణు మంచు అంచనాలకు తగ్గట్టుగా ఆ ధనస్సుని రూపొందించాడు. ఈ విల్లుతోనే న్యూజిలాండ్‌లో రెండు నెలల పాటు చిత్రీకరించారు.

ఈ ప్రత్యేకమైన విల్లు విశేషాలు పంచుకుంటూ కథానాయకుడు మంచు విష్ణు…

విల్లు కన్నప్పలో అంతర్భాగం అయింది. అతను దాన్ని అచంచలమైన గర్వంతో ఉపయోగిస్తూ.. తన తెగను, అడవిలో సమతుల్యతను కాపాడుకుంటాడు. ఈ కథ యువతలో ధైర్యాన్ని నింపుతుంది, విన్న వారందరిలో ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తుంది. మేము అనుకున్నదాన్ని అనుకున్నట్టుగా రూపొందించినందుకు సంతోషంగా ఉంది’ అని అన్నారు. కన్నప్ప చిత్రంతో తెరపై మన పౌరాణిక గాథను ఆవిష్కరించబోతోన్నారు. ఈ చిత్రానికి ముఖేష్ సింగ్ దర్శకత్వం వహించారు. మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి ప్రఖ్యాత నటీనటులు భాగమయ్యారు. శివుని భక్తుడైన ‘భక్త కన్నప్ప’ ఆకర్షణీయమైన కథను అద్భుతంగా చెప్పబోతోన్నారు. త్వరలోనే కన్నప్ప థియేటర్లోకి రానుందన్నారు…

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More