యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ‘ఆల్ఫా’ షూటింగ్‌ లో జాయిన్ అయిన ఆలియాభట్‌

యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్‌ ఫిల్మ్ ‘ఆల్ఫా’ షూటింగ్‌ లో బాలీవుడ్‌ లేడీ సూపర్‌స్టార్‌ ఆలియాభట్ జాయిన్ అయ్యారు. అత్యంత భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా యష్‌రాజ్‌ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న స్పై యూనివర్శ్‌ మూవీ ‘ఆల్ఫా’. ఇటీవల గ్రాండ్‌గా అనౌన్స్ అయిన ఈ సినిమా సెట్స్ కి హాజరయ్యారు నటి ఆలియా భట్‌. ఇప్పుడు వైరల్‌ అవుతున్నది ‘ఆల్ఫా’లో ఆలియా అసలైన లుక్‌ కాదు. సినిమాలో ఆమె లుక్‌ ఎవరి ఊహలకూ అందనంత గొప్పగా ఉంటుంది. ఆమె సెట్స్ లోకి ఎంటర్‌ అవుతున్నప్పుడు క్లిక్‌మనిపించిన లుక్కే వైరల్‌ అవుతోంది. అసలు ఆల్ఫా సెట్స్ నుంచి లుక్‌ లీక్‌ అయ్యే ఛాన్సే లేదు. సెట్‌కి అంతగా భద్రతను కల్పించింది యూనిట్‌. ఫస్ట్ ఫీమేల్‌ లీడ్‌ యష్‌రాజ్‌ స్పై యూనివర్శ్‌గా తెరకెక్కుతోంది ‘ఆల్ఫా’. ఇందులో ఆలియా సూపర్‌ ఏజెంట్‌గా నటిస్తారు. శివ రవైల్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. యష్‌రాజ్‌ ఫిల్మ్స్ లో ఇంతకు ముందు ప్రపంచ ప్రఖ్యాత ప్రాజెక్ట్ ‘ది రైల్వే మెన్‌’ కు డైరక్ట్ చేసిన ఘనత శివ రవైల్‌ది. భోపాల్‌ గ్యాస్‌ ట్రాజెడీ ఆధారంగా తెరకెక్కిన ఆ ప్రాజెక్ట్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటుంటారు ఆడియన్స్. యష్‌రాజ్‌ స్పై వర్శ్‌ గురించి చెప్పుకోవాలంటే ఏక్‌ థా టైగర్‌, టైగర్‌ జిందా హై, వార్‌, పఠాన్‌, టైగర్‌3 సినిమాలను ప్రస్తావించకుండా ఉండలేం. ప్రేక్షకుల్లో అత్యంత భారీ విజయాన్ని అందుకున్న సినిమాలవి. ఈ చరిష్మాతోనే ప్రస్తుతం ‘ఆల్ఫా’ను కాన్ఫిడెంట్‌గా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం యష్‌రాజ్‌ ఫిల్మ్స్ బ్యానర్‌లో వార్‌2 తెరకెక్కుతోంది. హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ నటిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు అత్యంత భారీగా ఉన్నాయి.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More