బాహుబలి తర్వాత ఆ స్థాయి సినిమా ప్రభాస్ నుంచి రాకపోయేసరికి అభిమానులు చాలా డెస్పాయింట్ గా ఉన్నారు. మరోపక్క నార్త్ బెల్ట్ ప్రభాస్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రోల్ చేస్తుంది. మొన్న ఆది పురుష్ మూవీ డైరెక్టర్ ఓం రౌత్ నిర్వాకం వల్ల ప్రభాస్ ఇమేజ్ కు మరింత డామేజ్ వచ్చింది. ఈ సమయంలోనే ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ మూవీ టీజర్ విడుదలై అంత ఇంపాక్ట్ క్రియేట్ చెయ్యలేకపోయినప్పటికి ఆదిపురుష్ మూవీ చూసి ప్రభాస్ ను ట్రోల్ చేసిన వారే సలార్ మూవీ టీజర్ చూసి షాక్ అయ్యారు.
సలార్ టీజర్ హవా కొనసాగుతున్న సమయంలోనే డైరెక్టర్ నాగ అశ్విన్- ప్రభాస్ కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ -కే టైటిల్ రివీల్ గ్లింప్స్ రిలీజ్ అయి యాంటీ ఫ్యాన్స్ నోటి మాట రాకుండా చేసింది. పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమాగా గ్లింప్స్ ఉండటంతో నార్త్ ఆడియన్స్ ప్రభాస్ కి ఇక జై కొట్టడం తప్పలేదు. ప్రాజెక్ట్- కే అంటే ఎంతో రివీల్ చేస్తూ టైటిల్ కల్కిగా గ్లింప్స్ లో చూపించారు. ప్రాజెక్ట్ -కే సినిమాకు చిత్రయూనిట్ కల్కి 2898 ఏడీ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రపంచాన్ని చీకటి కమ్మేసిన సమయంలో ఒక శక్తి ఉద్భవిస్తుందని అప్పుడు అంతం ప్రారంభమవుతుందని చెబుతూ ఈ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ విషయంలో నెగిటివ్ కామెంట్లు వినిపించగా గ్లింప్స్ విషయంలో మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ప్రభాస్ ఇంట్లో షాట్, అమితాబ్ షాట్, ప్రభాస్ సైడ్ యాంగిల్ షాట్, దీపిక లుక్ గ్లింప్స్ లో బాగున్నాయి. ప్రభాస్ కల్కి అవతారంలో ఈ సినిమాలో కనిపించనున్నారని తెలుస్తోంది. ప్రేక్షకుల ఊహలను మించి ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.భారతీయ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లే సినిమా ప్రాజెక్ట్ కే అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి ప్రాజెక్ట్ కే విషయంలో ఎలాంటి టెన్షన్ అక్కర్లేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎక్కువగానే శ్రద్ధ పెట్టారని గ్లింప్స్ ద్వారా క్లారిటీ వచ్చేసింది..