థియేటర్స్ దగ్గర కల్కి కల్లోలం

కల్కి సినిమా గ్రాండ్ రిలీజ్ తో మళ్లీ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా థియేటర్స్ కళకళలాడుతున్నాయి. కల్కి సినిమా థియేటర్స్ దగ్గర సందడి మొదలైంది. ఏ,బీ,సీ సెంటర్స్ మల్టీప్లెక్సులు అనే తేడా లేకుండా అన్ని థియేటర్స్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. కల్కి సినిమా ఎర్లీ మార్నింగ్ షోస్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్ రావడం తో జనాలు ధియేటర్స్ కి పోటెత్తారు.. ఏజ్ లిమిట్ లేకుండా పిల్లా పాపలతో ధియేటర్స్ ముందు వాలి పోయారు. వర్కింగ్ డే రోజే ఇలా వుంటే వీకెండ్ పరిస్థితి నెక్స్ట్ లెవెల్ లో వుంటుందని హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు. సమ్మర్ ముందు నుంచి ప్రేక్షకులు లేక వెలవెలబోయిన థియేటర్స్ ఇప్పుడు హౌస్ ఫుల్ బోర్డులతో సందడిగా మారాయి. కొన్ని సెంటర్స్ లోని ధియేటర్స్ లలో కేపాసిటీ కి మించి ఆడియన్స్ స్టాండింగ్ పోజిషన్ లో సినిమా చూసినట్టు సమాచారం. ధియేటర్ సిబ్బంది వస్తున్న జనాన్ని కంట్రోల్ చెయ్యలేక పోతున్నారు

కల్కి రిలీజ్, హిట్ టాక్ సొంతం చేసుకోవడం ఆడియన్స్ రెస్పాన్స్ తో ఎగ్జిబిటర్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సకుటుంబంగా ప్రేక్షకులు కల్కి సినిమా చూసేందుకు థియేటర్స్ కు వెళ్తున్నారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో టికెట్ అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. రికార్డ్ స్థాయిలో స్క్రీన్స్ ఉన్నా..టికెట్స్ దొరకనంత క్రేజ్ తో కల్కి ప్రదర్శితమవుతోంది. మైథాలజీ సైఫైగా కల్కి సినిమాను అద్భుతంగా రూపొందించిన దర్శకుడు నాగ్ అశ్విన్ కు, హాలీవుడ్ స్థాయి ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించిన వైజయంతీ మూవీస్ కు అందరి దగ్గర నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More