వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్ లో రవి, నరసింహా సమర్పణలో ఈ కొరియోగ్రఫీ, ఎడిటింగ్, ఫైట్స్ తో సహా చంద్రశేఖర్ రాథోడ్ నిర్మిస్తూ దర్శకత్వం వహించిన సినిమా గ్యాంగ్ స్టర్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గ్యాంగ్ స్టర్ సినిమా ఆగస్టులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోన్న సందర్భంగా ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో, దర్శక నిర్మాత చంద్రశేఖర్ రాథోడ్ మాట్లాడుతూ – సినిమా అంటే నాకు చాలా ఇష్టం. అన్నపూర్ణ స్టూడియోస్ లో డీఎఫ్ టీ కోర్స్ చేశాను. కొన్ని షార్ట్ ఫిలింస్ చేసిన తర్వాత నాలుగేళ్ల కిందట ఈ మూవీ స్టోరీ డెవలప్ చేశాం. ఆ తర్వాత ఒక్కొక్కటిగా వర్క్ చేసుకుంటూ వచ్చాం. మనం ఏదైనా బలంగా అనుకుంటే జరిగి తీరుతుంది అనేందుకు గ్యాంగ్ స్టర్ సినిమా ఎగ్జాంపుల్. మాకు ఫిలిం మేకింగ్ లో ఎన్నో ఇబ్బందులు వచ్చేవి. అయితే ఎలాగోలా, ఎవరో ఒకరి ద్వారా అవి సాల్వ్ అయ్యేవి. ఈ రోజు మా ఈవెంట్ కు ఇంతమంది పెద్దలు వచ్చి బ్లెస్ చేయడం కూడా నేను ఎక్స్ పెక్ట్ చేయలేదు. సినిమా టైటిల్స్ లో నాలుగైదు పేర్లు నావే ఉండాలని నేను అనుకోలేదు. డబ్బులు లేక ఫైట్స్, ఎడిటింగ్, కొరియోగ్రఫీ నేనే చేసుకున్నా. గ్యాంగ్ స్టర్ సినిమా టీజర్ ను విజయేంద్రప్రసాద్ గారికి చూపించాను. ఆయన హగ్ చేసుకుని టీజర్ బాగుందంటూ ఆశీర్వదించారు. నా ముందే దిల్ రాజు గారికి ఫోన్ చేసి గ్యాంగ్ స్టర్ సినిమా టీజర్ చూశాను బాగుంది మీరూ చూడండి అని అడిగారు. ఏడాదిన్నరగా దిల్ రాజు గారిని కలిసేందుకు నేను ప్రయత్నించినా కానిది విజయేంద్రప్రసాద్ గారి ఒక్క ఫోన్ తో అయ్యింది. దిల్ రాజు గారు టీజర్ చూసి బాగుందన్నారు. వారి సంస్థలో మా సినిమా రిలీజ్ కావాల్సిఉంది. వారి టీమ్ చూసి డిసైడ్ చేయబోతున్నారు. రేపు రాజమౌళి గారు కూడా మా సినిమా టీజర్ చూస్తారని ఆశిస్తున్నా. త్వరలోనే మీ ముందుకు మా గ్యాంగ్ స్టర్ సినిమాను తీసుకు రాబోతున్నాం. కల్కితో పాటు మా మూవీ టీజర్ కొన్ని థియేటర్స్ లో ప్లే చేస్తున్నాం. కల్కి మూవీ వెయ్యి కోట్ల వసూళ్లు సాధించాలి. అన్నారు. నటులు అభినవ్ జనక్ ,
అడ్ల సతీష్ కుమార్, రచయిత
మామిడి హరికృష్ణ, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి , హీరోయిన్ కాశ్వీ కాంచన్, రజాకార్ మూవీ డైరెక్టర్ యాట సత్యనారాయణ ,
నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ కుమార్ ,
నిర్మాత బోగేంద్ర గుప్తా, డైరెక్టర్ డాక్టర్ కాజా, డిస్ట్రిబ్యూటర్ అచ్చిబాబు ఎం అతిథులుగా పాల్గొన్నారు