దక్షిణ నియోజకవర్గ టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి గా తను గెలవడం లాంఛనమేనని వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు దురదృష్టం వెంటాడితే ముప్పై వేలు వేలుఅదృష్టం ఉంటే యాబై వేల మెజార్టీ తో దక్షిణ నియోజక వర్గం నుంచి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు లెక్కింపుకి టిడిపి జనసేన బిజెపి అభ్యర్థులకు కౌంటింగ్ ఏజెంట్లు వైసిపి ఏజెంట్స్ దొరకరని ప్రచారం చేస్తూ జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని అందుకే విశాఖలో సిఎం ప్రమాణ స్వీకారం అంటుప్రచారం చేసు కుంటున్నా వైసిపి కి మాత్రం ఓటమి తప్పదన్నారు. నూట ముప్పై ఐదు నుంచి నూట యాభై వరకు కూటమి కి స్థానాలు రావడం ఖాయం అని అన్నారు. రాష్ట్రం అభివృద్ది పరంలో వెళ్లాలంటే కూటమి అధికారంలో రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని అన్నారు తాను ఓడిపోతానని ఒక వర్గం మీడియా దుష్ప్రచారం చేయటాన్ని ఖండిస్తున్నా ను. నేను ఖచ్చితంగా గెలుస్తానని అన్నారు ఆ సంస్థలకు ఓపెన్ చాలెంజ్ చేస్తున్నాను నేను ఓడితే రాజకీయాల నుంచి తప్పుకుంటాను, నేను గెలిస్తే మీ మీడియా సంస్థలు మూసివేస్తారా అని ప్రశ్నించారు వంశీ కి లైఫ్ స్టార్ట్ అయింది ఒక అన్ని విజయాలే అని అన్నారు కూటమి ఇరవై ఒక్క ఎంపి స్థానాలు గెలుచుకుంటుంది అందులో విశాఖ లోక్ సభ స్థానం ఉంది అని చెప్పారు. రాష్ట్రంలో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుచుకొని రికార్డు సృష్టిస్తుంది అని పేర్కొన్నారు