న్యూయార్క్ లో ఈనెల 22వ తేదీన జరగనున్న సదస్సులో పవన్ ప్రసంగించేందుకు జనసేనా పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందినట్లు విపరీతంగా ప్రచారం జరుగుతోంది.. ఈనెల 20వ తేదీన ఆయన న్యూయార్క్ బయల్దేరుతున్నారని సమాచారందేశం తరఫున నిస్వార్థంగా పని చేసే నలుగురికి మాత్రమే ఆహ్వానం అందుతుందని అటువంటి అరుదైన అవకాశం పవన్ కళ్యాణ్ దక్కించుకున్నారన్నది ఆ ప్రచార సారాంశం.. ఇటువంటి అవకాశం పవన్ కళ్యాణ్ కి దక్కితే అది సాధారణమైన విషయం కాదని విశ్లేషకులు అంటున్నారు అయితే పవన్ కళ్యాణ్ తో పాటు పాల్గొనబోతున్న మిగిలిన ముగ్గురు ఎవరనేది కూడా తెలియరాలేదు.. అలాగే ఈ నెల సదస్సు ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి వెబ్సైట్ లో గాని ఇతర వార్తా సంస్థలు గాని ఈ విషయాన్ని దృవీకరించలేదు.. కొన్ని న్యూస్ చానల్స్ లో ఈ వార్త ప్రసారం చేయగా జనసైనికులు తమ నేత కు గొప్ప అవకాశం లభించిందని ఈ వార్త ని వైరల్ చేస్తున్నారు.. మరికొన్ని చానల్స్ ఈ న్యూస్ ని ప్రస్తావిస్తూ ఎన్నికల హడావుడి లో ఇది ప్రముఖం కాలేదని పేర్కొంది.