యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థలు లైకా ప్రొడక్షన్స్ రెడ్ జెయింట్ బ్యానర్ల పై సుభాస్కరన్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా జులై 12న ఈ చిత్రం విడుదలైంది. భారతీయుడు సినిమాకు ఇది సీక్వెల్. ఇండియన్ 2 పేరుతో తమిళంలో, భారతీయుడు 2 పేరుతో తెలుగు, హిందుస్థానీ పేరుతో హిందీలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఆగస్ట్ 9న ప్రేక్షకులకు మరింత చేరువ కానుంది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో భారతీయుడు 2 అలరించనుంది.
కమల్ హాసన్ అద్భుతమైన నటన, శంకర్ టేకింగ్, లైకా ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ వేల్యూస్‌తో లార్జర్ దేన్ లైఫ్ చిత్రంగా భారతీయుడు 2 అలరించింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కానుంది. లంచగొండులపై ఇండియన్ తాత ఎలా పోరాటం చేశాడనే కథాంశంతో రూపొందిన భారతీయుడు సినిమాకు ఇది సీక్వెల్. సిద్ధార్థ్, ఎస్.జె.సూర్య, రకుల్ ప్రీత్ సింగ్, గుల్షన్ గ్రోవర్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.