తిరుమల శ్రీవారి దర్శనం ఎలా..?

తిరుమల(Tirumala) దర్శనానికి కొందరు రెగ్యులర్ గావెళ్తుంటే, మరికొంతమంది వెళ్లలేక పోతున్నారు అలాంటి వాళ్ళు వేసే ప్రశ్న ఒక్కటే.. దర్శనం టిక్కెట్లు ఎలా పొందాలి..? అసలు దొరుకుతాయా..? అక్కడికి వెళ్లి ట్రై చెయ్యాలా..? టూర్ సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోతున్నాం దర్శనం టిక్కెట్ల కారణం గానే అంటున్నారు. నిజానికి తిరుమల శ్రీవారి దర్శనం టిక్కెట్లు ఆఫ్ లైన్(online), ఆన్ లైన్లో(offline) కూడా ఎలా పొందొచ్చో తెలుసుకోండి.

ఆన్లైన్ ఆర్జిత సేవా టిక్కెట్లు

ఆన్లైన్ లో టిక్కెట్లను వెబ్సైట్ ద్వారా మొబైల్ యాప్ ద్వారా వివిధ సేవలకు సంబంధించిన టిక్కెట్ల ను భక్తులకు అందిస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రతినెలా శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన కోటాను ఆ నెల 18,19 తేదీలలో ఉదయం 10 గంట‌ల‌కు ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం
ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. ఇలా నమోదు చేసుకున్న ఎంట్రీ లను లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేస్తుంది టీటీడీ(TTD)
ఆన్‌లైన్‌లో సెలెక్ట్ అయి టికెట్లు పొందిన వారు 21 తేదీ నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నిర్ధేశించిన సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి. అదేవిధంగా కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన నెల కోటాను 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అలాగే అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుండగా శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆన్ లైన్ కోటాను అక్టోబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించు కునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు అదే విధంగా ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల(300 రూపాయల టిక్కెట్) కోటాను 24న ఉదయం 10 గంటలకు ఇక తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా అలాగే మొబైల్ లో TTDevasthanams ఆప్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఈ తేదీలలో ఒకటి రెండు రోజులు అటు ఇటు మార్పు జరిగే అవకాశం ఉంది.

ఆఫ్ లైన్ దర్శన టిక్కెట్లు

ఆఫ్ లైన్ లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వివిధ దర్శన టిక్కెట్లను భక్తులకు అందిస్తోంది. స్లాటెడ్ సర్వ దినోత్సవం(SSD tokens) ముందు రోజు రాత్రి 9 నుండి శ్రీనివాసం ( తిరుపతి బస్ స్టేషన్ ) విష్ణు నివాసం( తిరుపతి రైల్వేస్టేషన్ ) భూదేవి కాంప్లెక్స్ (అలిపిరి ) లలో రోజుకి 25 వేలు చొప్పున జారీ చేస్తారు. మరుసటి రోజు 12 తరువాత దర్శనం ఉంటుంది. ఈ దర్శనం దాదాపు రెండు గంటల నుండి నాలుగు గంటల్లో అయిపోతుంది. ఈ దర్శన టిక్కెట్లు భక్తులకు పూర్తిగా ఉచితం గానే అందిస్తుంది. ఇవే టికెట్స్ ఆన్లైన్ లో అయితే మూడు వందల రూపాయలు చెల్లించాలి ఈ దర్శనానికి కూడా ఉచిత లడ్డు ని అందిస్తుంది టీటీడీ. ఉచిత దర్శనం గా భావించే సర్వ దర్శనం(SARVA DHARSHANAM) టిక్కెట్లు రోజుకి ఇన్ని మాత్రమె అని నిబంధన ఏమి లేవు. రోజుకి ఎంత మందైనా దర్శనం చేసుకోవచ్చు. అయితే దర్శన సమయం ఎనిమిది గంటలు అంతకు మించి కూడా పట్టొచ్చు ఒక్కో సందర్భం లో గంటా రెండు గంటలలో కూడా అయిపోవచ్చు. మరో దర్శనం
దివ్యనుగ్రహ హోమము టికెట్స్ ఇవి అలిపిరి వద్ద సప్త గౌ ప్రదక్షిణ మండపం వద్ద తెల్లవారి 2 నుండి 6 వరకు రోజుకి 50 చొప్పున జారీ చేస్తారు. అదే రోజు ఉదయం తిరుపతి అలిపిరి వద్ద హోమామ్ లో పాల్గొని మద్యాహ్నం దర్శనం చేసుకోవాలి. ఇక ప్రత్యేక దర్శనం గా భావించే శ్రీవాణి టికెట్స్(SRIVANI TRUST) ఆన్ లైన్ లో కాకుండా తిరుపతి ఎయిర్పోర్ట్ లో రోజుకు వంద చొప్పున.. తిరుమలలో కొండ మీద jeo ఆఫీస్ వద్ద రోజుకు 900 చొప్పున అంటే మొత్తంగా రోజుకు 1000 చొప్పున ఈ దర్శన టిక్కెట్లు ఒక రోజు ముందు జారిచేస్తారు. శ్రీవాణి టికెట్స్ కి మొదటి గడప దర్శనం ఉంటుంది. అంటే గర్భాలయంలో ఒక గడప దాటి దర్శనం చేసుకోవచ్చు.
అలాగే దివ్య దర్శనం( DD darshanam) టిక్కెట్లు ప్రత్యేకించి
కాలి నడకన వెళ్లే భక్తులకు రోజుకి రెండు వేలు చొప్పున శ్రీవారి మెట్టు వద్ద తెల్లవారి 6 నుండి జారీ చేస్తుంటారు. ఈ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది టీటీడీ మరో ప్రత్యేక దర్శనాన్ని మానవతా దృక్పథంతో ప్రవేశపెట్టింది. అశ్వని హస్పిటల్ లో రక్త దానం చేసేవారికి రోజుకి 10 మందికి ఈ తరహా దర్శనం కల్పిస్తారు. రక్తదాన కార్యక్రమం తెల్లవారి 5 నుండి ఉంటుంది. ఈ దర్శనానికి 2 నుండి 5 గంటల పట్టే అవకాశం ఉంటుంది
అదే విధంగా ఆఫ్ లైన్ లక్కీ డిప్ టిక్కెట్ విధానాన్ని కూడా టీటీడీ అందిస్తోంది. ఒకరోజు ముందు జేఈఓ(JEO) కార్యాలయం దగ్గర ఉదయం 11 నుండి 5 లోపు అక్కడ ఏర్పాటు చేసే లక్కీ డిప్ లో పాల్గొంటే సాయంత్రo 6 గంటలకి రిజల్ట్స్ ఎనౌన్స్ చేస్తారు. ఆ డిప్ లో ఎంపిక అయితే మరుసటి రోజు సేవ అనంతరం దర్శనం ఉంటుంది. సేవ గంట లోపు దర్శనం 2 గంట లలోపు అయిపోతుంది. ఇక మరో ప్రత్యేక దర్శనం వి ఐ పి(VIP) బ్రేక్ దర్శనం ప్రజా ప్రతినిధులైన ఎమ్మెల్యే, ఎంపీల సిఫారసు ద్వారా ఒక లెటర్ పై ఆరుగురు వరకు దర్శనం కల్పిస్తారు. ఒక రోజు ముందే ఉదయం పదకొండు గంటల లోపు జేఈఓ ఆఫీస్ వద్ద లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. సాయంత్రం ఎంపిక అయినట్లు మొబైల్ కి మెసేజ్ ఇంకా పేమెంట్ లింక్ వస్తుంది. ఆన్లైన్ లో పేమెంట్ చేసి టికెట్స్ పొందాలి. మరుసటి రోజు ఉదయం వీరికి మొదటి గడప దర్శనం ఉంటుంది. టికెట్ ధర ఒక్కొక్కోరికి ఆరు వందల రూపాయలు ఉంటుంది.

సీనియర్ సిటిజన్ల కోసం

65 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు శ్రీ వేంకటేశ్వర తిరుమల ఉచిత దర్శనం కోసం టీటీడీ రెండు స్లాట్‌లు కేటాయించింది. ఫోటో ఐడీతో పాటు ఏజ్ ప్రూఫ్ తో సమర్పిస్తే చాలు వీరికి దర్శనం జరుగుతుంది వీరి దర్శన సమయంలో ఇతర క్యూ లైన్లు నిలిపి ఎటువంటి ఒత్తిడి లేకుండా సీనియర్ సిటిజన్లు మాత్రమే దర్శించి ఏర్పాటు చేసింది. ఇక ఇరు రాష్ట్రాల పర్యాటక శాఖ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో వచ్చేవారికి రోజుకి వెయ్యి చొప్పున300 రూపాయల ప్రత్యేక దర్శనానికి టిక్కెట్లను జారీచేస్తుంది.. ఈ టిక్కెట్లను వారం రోజుల ముందు బుక్ చేసుకోవచ్చు..

వాట్సప్ సమాచారం

తిరుమల తిరుపతి దేవస్థానం కి సంబంధించిన నాలుగు ముఖ్యమైన సేవలను వాట్సప్ సేవల పరిధి లోకి తీసుకువచ్చారు. స్లాటెడ్ సర్వదర్శన టోకెన్ సెంటర్ల లో
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు
సర్వ దర్శనం క్యూలైన్ స్థితి శ్రీవారి దర్శనానికి తీసుకునే సమయం శ్రీవాణి టికెట్ల లభ్యత వసతి గదులకు సంబంధించిన డిపాజిట్ రీఫండ్ వివరాలు టికెట్లను బుక్ చేసుకునే విధానాలను ఇందులో 9552300009 నంబర్‌ ద్వారా అందుబాటులోకి తెచ్చింది అంతే కాకుండా ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజన్స్ ఉపయోగించి క్యూ లైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా రెండు, మూడు గంటల్లోనే దర్శనమయ్యేలా కూడా ఒక ప్రణాళిక ను రూపొందిస్తున్న టీటీడీ మే 01 నుండి వీఐపీ బ్రేకు దర్శనాల్లో మార్పు చేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపి లకు మాత్రమే మే 01 నుండి జూలై 15 వరకు బ్రేక్ దర్శనాలు పరిమితం చేయనున్నట్టు కీలక నిర్ణయం తీసుకుంది.

Related posts

శ్రీవారి దర్శనానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్..

‘మట్కా’ నుంచి వింటేజ్ బ్రాండ్ న్యూలుక్ పోస్టర్స్

అక్టోబరు 19న శ్రీ‌వారి ఆర్జితసేవా ఆన్లైన్ టికెట్ల విడుదల

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More