ఢిల్లీ లో అంత టెంపరేచర్ నిజమేనా…?రెడ్ అలెర్ట్ హెల్త్ నోటీసు జారీచేసిన ఐ ఎం డి…!

ఢిల్లీ లో వాతావరణ కేంద్రం 52.9 డిగ్రీల సెల్సియస్‌ను నమోదు చేసింది,గతం లో ఎప్పుడు భారత దేశం మొత్తమ్మీద ఎక్కడ కూడా ఈ రేంజ్ టెంపరేచర్ నమోదు కాలేదు. ఢిల్లీలో 20 మానిటరింగ్ స్టేషన్లు ఉన్నాయని, ఢిల్లీ అంతటా సగటున 45-50 డిగ్రీల సెల్సియస్‌లో ఉష్ణోగ్రత నమోదైందని ఐ ఎం డి (IMD) డైరెక్టర్ జనరల్
డాక్టర్ మహపాత్ర తెలిపారు. అయితే ఢిల్లీలోని ముంగేష్‌పూర్ ఆటోమేటిక్ వాతావరణ స్టేషన్‌లోని ఉష్ణోగ్రత సెన్సార్‌ మాత్రం తీవ్రత ఎక్కువ గా చూపించింది. సెన్సార్ సరిగ్గా పని చేస్తుందో లేదో తెలుసుకోవడానికి వాతావరణ విభాగం (IMD) తనిఖీ చేస్తోంది. కొన్ని అబ్జర్వేటరీలు కొంచెం ఎక్కువ ఉష్ణోగ్రతను చూపించాయి, అయితే ముంగేష్‌పూర్ రికార్డింగ్‌పై పూర్తి విచారణ అవసరమని అభిప్రాయపడ్డారు ఉష్ణోగ్రత సెన్సార్‌ను తనిఖీ చేయడానికి నిపుణుల బృందం ముంగేష్‌పూర్‌కు వెళ్లిందని డాక్టర్ మహపాత్ర తెలిపారు. ముంగేష్‌పూర్ చుట్టుపక్కల స్థానిక అంశాలు ఈ అధిక రికార్డింగ్‌కు కారణం కావచ్చని కూడా అతను ఊహించాడు. ఢిల్లీ లో గరిష్ఠ ఉష్ణోగ్రత నగరంలోని వివిధ ప్రాంతాల్లో 45.2 నుండి 49.1 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంది. ఇతర స్టేషన్‌లతో పోలిస్తే ముంగేష్‌పూర్ 52.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సెన్సార్‌లో లోపం లేదా స్థానిక కారకం వల్ల కావచ్చు. IMD డేటా సెన్సార్‌లను పరిశీలిస్తోందని ఒక ప్రకటన లో తెలిపింది.
ఎర్త్ సైన్సెస్ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, అధికారికం గా ఈ ఉష్ణోగ్రత ను ప్రకటించలేదని ఢిల్లీలో 52.3 డిగ్రీల సెల్సియస్ కంటే ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉందని పూర్తినివేదిక వచ్చిన తరువాత అధికారిక ప్రకటన చేస్తామన్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వెనుక కారణాన్ని వివరిస్తూ, భారత వాతావరణ విభాగం (IMD) ప్రాంతీయ అధిపతి కుల్దీప్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, రాజస్థాన్ నుండి వేడి గాలులు వీచే మొదటి ప్రాంతాలు నగర శివార్లలో ఉన్నాయని అన్నారు.
ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు ఈ వేడి గాలుల ముందస్తు రాకకు ప్రత్యేకించి, ఇప్పటికే ఉన్న తీవ్రమైన వాతావరణాన్ని మరింత దిగజార్చాయి. ముంగేష్‌పూర్, నరేలా మరియు నజఫ్‌గఢ్ వంటి ప్రాంతాలు ఈ వేడి గాలుల యొక్క పూర్తి శక్తిని మొదట అనుభవించాయని పిటిఐ వార్తా సంస్థ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఉష్ణోగ్రత ఊహించిన దాని కంటే తొమ్మిది డిగ్రీల ఎక్కువ ఉందని రెండవ రోజు రికార్డు స్థాయి వేడి, మరియు 2002 రికార్డు 49.2 డిగ్రీల సెల్సియస్ నుండి డిగ్రీ కంటే ఎక్కువ పెరిగిందన్నారు. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో గరిష్టంగా 46.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది, గత 79 ఏళ్లలో ఇదే అత్యధికం అని అధికారులు చెప్తున్నారు. ఇదిలా ఉండగా 30 మిలియన్లకు పైగా జనాభా ఉన్న ఢిల్లీకి IMD రెడ్ అలర్ట్ హెల్త్ నోటీసును జారీ చేసింది.
వేసవి ఉష్ణోగ్రతలు పెరగడం భారతదేశానికి కొత్తేమీ కాదు, కానీ అనేక సంవత్సరాల శాస్త్రీయ పరిశోధనలో వాతావరణ మార్పు,హీట్ వేవ్స్ ఉధృతి వలన పరిస్థితి తీవ్రంగా మారుతుందని వివరించారు.
అత్యధిక సంఖ్యలో ఏసీ ల వాడకం కారణంగా ఆల్-టైమ్ హై పవర్ డిమాండు 8,302 మెగావాట్ల (MW) పెరిగిందని, విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లో అత్యధిక ఉష్ణోగ్రత ఫలోడిలో 51 డిగ్రీల సెల్సియస్ 50.8 డిగ్రీల సెల్సియస్. హర్యానాలోని సిర్సాలో 50.3 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది.
అరేబియా సముద్రం నుండి తేమతో కూడిన గాలి రావడం కారణంగా దక్షిణ రాజస్థాన్ జిల్లాలు – బార్మర్, జోధ్‌పూర్, ఉదయపూర్, సిరోహి మరియు జలోర్ 4 డిగ్రీల సెల్సియస్ తగ్గుదల నమోదైంది.
భవిష్యత్ వాతావరణాన్ని అంచనా వేయడానికి ప్రస్తుత వాతావరణ పరిశీలనలను ప్రాసెస్ చేయడానికి కంప్యూటర్ మోడల్‌లను ఉపయోగించే న్యూమరికల్ వెదర్ ప్రిడిక్షన్ (NWP) డేటా ప్రకారం మే 30 నుండి హీట్‌వేవ్ పరిస్థితుల నుండి క్రమంగా ఉపశమనాన్ని కలిగిస్తూ ఉత్తరం వైపు మరింత విస్తరించే అవకాశం ఉందని అభిప్రాయపడింది.

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

మంగ్లీకి బిస్మిల్లా ఖాన్ గౌరవపురస్కారం

మొదలైన సినిమాటిక్ ఎక్స్పో

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More