ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో యూ ఏ ఈ లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. నిద్రలేవక ముందునుంచి వర్షాలు కురుస్తుండడం తో చాలా మంది తమ రోజు వారీ కార్యక్రమాలకు ఇంటిని వదిలివెళ్లలేకపోయారు.. వ్యాపారసంస్థలు తెరుచుకోలేదు.. కురుస్తున్న భారీ వర్షాలకు బలమైన గాలులు తీర ప్రాంతాలను బలంగా తాకాయి ఉత్తరాన, పర్వతాలపై చీకటి వర్షపు మేఘాలు కమ్ముకోవడంతో జలపాతాలు ఉప్పొంగుతున్నాయి. గత కొన్ని రోజులుగా, యూ ఏ ఈ లో కొనసాగుతున్న అస్థిర వాతావరణం ఈరోజు, రేపు, కూడా కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు.. ఇది గరిష్ట స్థాయికి చేరుకుంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు సెక్టార్‌ల వారీగా భద్రతా చర్యలు జారీ చేయబడ్డాయి. చాలా స్కూల్స్ కు ఆన్లైన్ క్లాసులు తీసుకోవాలని అలాగే ఉద్యోగులకు ఇంటి నుండి పని చేసే వెసులుబాటు కల్పించాలని విద్యాసంస్థలను, కంపెనీలను కోరుతూ ప్రకటన జారీ చేశారు.. ఎంటర్టైన్మెంట్ పార్కులు బీచ్‌లు మూసివేసారు. ఎయిర్‌పోర్ట్‌లు మరియు విమానయాన సంస్థలను కూడా తుపానుని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు. నిన్న మొన్నటి విధ్వంసాన్ని మరిచిపోక ముందు మరో ముప్పు పొంచి ఉందన్న విషయం విన్న దగ్గనుంచి దుబాయ్ వాసులు బిక్కుబిక్కుమంటూన్నారు..
జాతీయ వాతావరణ కేంద్రం (NCM) జారీ చేసిన హెచ్చరికల ప్రకారం, అర్ధరాత్రి నుండి దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి, దుబాయ్‌లో తెల్లవారుజామున 2.35 గంటలకే జల్లులు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.