పేరెంటింగ్ ఎమోషన్ గురించి ఎప్పటినుంచో చెప్పాలనుకుంటున్న డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య

పేరెంటింగ్ ఎమోషన్ గురించి కొంచెం డిఫరెంట్ గా చెప్పాలని ఎప్పటినుంచో అనుకున్న పాయింట్ ని ఫన్ గా ఫుల్ ఎనర్జీతో చెప్పాలనేది నా ఉద్దేశం. అని మనమే చిత్ర దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య అన్నారు. పిల్లలతో సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. అందులో తెలియని ఇన్నోసెన్స్ వుంటుంది. ఆ ఇన్నోసెన్స్ టచ్ చేయాలని అనుకున్న కథ. మా పేరెంట్స్ తో చాలా ఎటాచ్ గా వుంటాను. బాబు పుట్టాక ఆ ఎటాచ్ మెంట్ ఇంకా పెరిగింది. అని చెప్పుకొచ్చారుశర్వానంద్ కృతి శెట్టి హీరో , హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామ్‌సే స్టూడియోస్‌ ప్రొడక్షన్ లో నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ అత్యంత గ్రాండ్‌గా నిర్మిస్తున్న ‘మనమే’ జూన్ 7న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానున్న నేపధ్యంలో డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య మూవీ విశేషాలని విలేకరులతో పంచుకున్నారు. ‘ఏడిస్తే ఎవరో ఒకరే ఏడవండి’ గురించి ప్రస్తావిస్తూ చాలా డైలాగులు రియల్ లైఫ్ నుంచి రిలేట్ చేసుకునేలానే వుంటాయన్నారు.లండన్ లో అరవైమంది క్రూ తో వెళ్లి షూట్ చేయడం చాలా ఠఫ్ టాస్క్. లండన్ క్లైమెట్ కూడా అన్ ప్రిడిక్టబుల్ గా వుటుంది. ఒక లొకేషన్ అనుకుని షూట్ స్టార్ట్ చేశాక సడన్ గా వర్షం పడుతుంది. క్లైమెట్, అక్కడ లాజిస్టిక్స్ విషయంలో కొన్ని ఛాలెంజస్ ఎదుర్కొన్నామన్నారు.మనమే నా ఫేవరేట్ జోనర్. నాకు హ్యుమర్ చాలా ఇష్టం. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో మనమే నా మోస్ట్ ఫేవరేట్ ఫిల్మ్. మా అబ్బాయి యాక్ట్ చేశాడనే ఒక రీజన్ వుంది కానీ సినిమా చూసినప్పుడు మీరే అర్ధమౌతుంది. ఇందులో చైల్డ్ క్యారెక్టర్ కోసం ఫస్ట్ నుంచి విక్రమ్ ఆదిత్యనే అనుకున్నాం. ఇందులో 16 పాటలు వున్నాయని ఆ సాంగ్స్ సినిమా ఫ్లో కి యాడ్ అవుతాయే గానీ ఆపవు. ఇందులో ప్రతి సాంగ్ సినిమాని ఇంకా ఫాస్ట్ గా తీసుకెళుతుంది మనమే కథ అనుకున్నప్పుడే విజువల్ గా ఒక కలర్ టోన్ ఫిక్స్ అయిపోయాను. ఫెయిరీ టైల్ లాంటి సినిమా చేయాలని అనుకున్నాం. అలాంటి సినిమా చేయాలంటే ముజిక్కే ఆ యాడ్ ఆన్ ఇస్తుంది. హేశం చాలా బ్యూటీఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు.కృతిశెట్టి నేను అనుకున్న క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. సినిమాలో చాలా బ్రిలియంట్ గా యాక్ట్ చేసింది.. ఫెయిరీ టైల్ లాంటి కథ అనగానే లండన్ లో అలాంటి ఆర్కిటెక్చర్ వుంటుంది. అది వుంటనే ఆ మ్యాజిక్ వస్తుంది. అందుకే లండన్ వెళ్లాం. విశ్వప్రసాద్ గారు చాలా సపోర్టివ్. దాదాపు అరవై మంది క్రూతో అక్కడి వెళ్లాం. ఈ సినిమాకు ఇద్దరు డీవోపీలు పని చేశారని చెప్తూ విష్ణు లండన్ లో షూట్ చేశారు, ఇక్కడి వచ్చాక తనకి వేరే ప్రాజెక్ట్ ఉండడం తో జ్ఞాన శేఖర్ గారు మిగతా పోర్షన్ షూట్ చేశారని చెప్పుకొచ్చారు.

Related posts

కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు

“పుష్ప 2′ ది రూల్ నుండి ‘పీలింగ్స్’

మహేష్ చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంటున్న నమ్రతా శిరోద్కర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More