భారత భూభాగంలోకి చైనా వచ్చేది వీటికోసమా..?

కనీసం మూడు నెలలకొకసారైన చైనా భారత భూభాగంలోకి చొచ్చుకొని రావడం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడం.. భారత సేనలు ధీటు గా జవాబివ్వడం ఈ మధ్య కాలంలో చాలా కామన్ అయిపోయింది. అరుణాచల్ ప్రదేశ్ మాదే అంటూ తరచు ప్రకటనలు ఇవ్వడం చైనా కు అలవాటుగా మారింది. అసలింతకు భారత భూభాగంలోకి చైనా దళాలు ఎందుకొస్తున్నాయి. సరిహద్దుల్లో తరచూ ఉద్రిక్తత పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో చైనా బలగాలు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నాయి. ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరగడం.. పలువురికి గాయాలవ్వడం.ఇలాగే జరుగుతుంది ఇరుదేశాల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు సైన్యాధికారులు ఇప్పటికే 21 దఫాలుగా చర్చలు జరిపారు. అయినా చైనా సైన్యం తన పరిధిదాటి భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. వారి కుయుక్తులను భారత బలగాలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉంది. అయితే, భారత భాగంలోని ఆ సరిహద్దు ప్రాంతంలోకి తరచు చైనా వచ్చేందుకు ఎందుకు ప్రయత్నిస్తోందన్న అంశాన్ని పరిశీలిస్తే విస్తు పోయే విషయం వెల్లడైంది. అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో హిమాలయ గోల్డ్ గా పిలుచుకునే కార్డిసెప్స్(Cordyceps) ఫంగస్ కోసమేనని తెలిసింది. ఇండో – పసిఫిక్ ఫర్ స్ట్రాలెజిక్ కమ్యూనికేషన్స్ (ఐపీసీఎస్‌సీ) ఓ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంతకీ ఫంగస్ కోసం చైనా ఇంత తెగించిందా…? అంటే ఆ ఫంగస్ అంత విలువైనది మరి. హిమాలయ గోల్డ్‌గా పిలుచుకునే కార్డిసెప్స్ ఫంగస్‌లో అనేక ఔషధ గుణాలున్నాయి. క్యాన్సర్ కణాలను అడ్డుకొనే శక్తి దీనికి ఉందని చైనీయులు భావిస్తున్నారు. వీటి ధర బంగారం కంటే ఎక్కువ. దేశ, విదేశాల్లో వీటికి భారీ డిమాండ్ ఉంది. 2022లో దీని మార్కెట్ విలువ రూ. 8,900 కోట్లు. కార్డిసెప్స్ 10 గ్రాముల ధర సుమారు 700 డాలర్లు (రూ. 56వేలు) ఉంటుందని తెలుస్తోంది. మేలురకమైన కార్డిసెప్స్ కిలో ధర లక్షల్లోనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పసుపు, కాషాయ రంగుల్లో వుండే కార్డిసెప్స్ ఫంగస్ అచ్చం పచ్చిమిర్చిని పోలి ఉంటాయి. ఎక్కువగా భారత్‌లోని హిమాలయ ప్రాంతంతో పాటు చైనా నైరుతిలోని కింగై – టిబెట్ వంటి ఎత్తయిన ప్రదేశాల్లో కనిపిస్తుంది. వీటి ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా ముందుంది. ఇటీవలి కాలంలో కింగై ప్రాంతంలో వీటి సాగు క్షీణించడంతో ఆ ప్రాంతంలో ఫంగస్ కొరత ఏర్పడింది. చైనాలో వీటికి విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో వాటిని వెతుక్కుంటూనే చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఐపీసీఎస్‌సీ నివేదిక తెలిపింది.

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

మంగ్లీకి బిస్మిల్లా ఖాన్ గౌరవపురస్కారం

మొదలైన సినిమాటిక్ ఎక్స్పో

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More