ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హవా కొనసాగుతుంది. బాలయ్య ఏం చేసినా అది ట్రెండే అవుతుంది. అన్స్టాపబుల్ కార్యక్రమం ఆయనలోను మరో కోణాన్ని బయటకు తీసింది. ఎప్పుడు సీరియస్ గా ఉంటూ, అభిమానులపై చేయి చేసుకుంటూ తరచుగా వివాదాల్లో ఇరుక్కుంటున్న బాలయ్యకు అన్ స్టాపబుల్ నిజంగానే బాలయ్యకు చాలా ప్లస్ అయింది. ఎంతో సరదాగా, కలివిడిగా, అందరితో కలిసిపోయి ఉండే మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న చాలామంది ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులుగా మారిపోయారు. ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా గుర్తింపు పొందిందంటే దానికి కారణం ఏంటో ఇప్పటికే అందరికీ తెలిసి ఉంటుంది. హోస్ట్ గా ఆన్ స్టాపబుల్ సీజన్ వన్ ను విజయవంతం చేసిన బాలయ్య ఆన్ స్థాపబుల్ సీజన్ 2 ను విజయ పదంలో నడిపిస్తున్నారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు ఈ కార్యక్రమానికి వచ్చి సందడి చేశారు.త్వరలో నే ఈ రెండు ఎపిసోడ్లు టెలికాస్ట్ కానున్నాయి. ప్రభాస్, పవన్ కళ్యాణ్ ల ఎపిసోడ్ల కోసం అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అన్ స్టాపబుల్ టాక్ షో తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న బాలకృష్ణ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి హోస్ట్ గా కూడా వ్యవహరించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటిదాకా ఎన్టీఆర్, నాని, నాగార్జునకి కూడా ఇవ్వనంత పారితోషికం బిగ్ బాస్ బృందం బాలయ్య కి ఆఫర్ చేయనున్నట్లుగా తెలుస్తోంది బిగ్ బాస్ సీజన్ 3 నుంచి ఇప్పటివరకు నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఈసారి మాత్రం ఆ హోస్ట్ ప్లేస్ ను బాలకృష్ణ తో రీప్లేస్ చేయాలని బిగ్ బాస్ నిర్వాహకులు ఆలోచిస్తున్నారు. ఆహా షో లో బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో ఎంతటి ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక బిగ్ బాస్ లో కూడా బాలయ్యతో చేస్తే రేటింగ్ అమాంతంగా పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. బిగ్ బాస్ యాజమాన్యం హోస్ట్ గా చేయాలనీ అడగడం, ఆయన ఒప్పుకోవడం జరిగిందని చెప్పుకొస్తున్నారు. ఇక ఇందుకోసం బాలయ్య భారీ పారితోషికం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సీజన్ మొత్తానికి గాను రూ.10 కోట్లు అందుకోనున్నాడనే ప్రచారం జరుగుతుంది. బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధిక రెమ్యూనిరేషన్ అంటే ఇదే అని చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే. మొదటి సీజన్‌ను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. దానికి 16.18 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇక రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేయగా.. లాంచ్ ఎపిసోడ్ 15.05 రేటింగ్ వచ్చింది. ఇక అక్కినేని నాగార్జున బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 నుండి హోస్ట్ గా కొనసాగుతున్నారు. బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్‌కు 17.9 రేటింగ్ వచ్చింది. నాల్గోవ సీజన్‌కు 18.5 రేటింగ్, బిగ్ బాస్ తెలుగు ఐదో సీజన్‌కు 15.70 రేటింగ్ వచ్చింది. ఇక లేటెస్ట్ ఆరో సీజన్ లాంచ్ ఎపిసోడ్‌కు అత్యంత తక్కువగా 8.86 పడిపోయింది. అన్ స్టాపబుల్ షో తో ఎక్కడ వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతున్న నందమూరి హీరో బాలకృష్ణను హోస్టుగా తీసుకొస్తే బిగ్ బాస్ మరింత రంజుగా మారుతుందని నిర్వాహకులు భావిస్తూ ఉన్నారట. ఇక వచ్చే సీజన్ 2023 జూన్ లో మొదలు పెట్టాలని ఆలోచనలో ఉన్నారు నిర్వాహకులు. ఇప్పటికే యువ హీరో అయిన రానా అలాగే విజయ దేవరకొండ పేర్లు కూడా కొన్నిసార్లు వినిపించాయి. కానీ ప్రస్తుతం హడావిడి చూస్తుంటే మాత్రం బాలకృష్ణ ఫిక్స్ అయిపోయాడు అని తెలుస్తుంది. అయితే బాలకృష్ణ ఇక ఇప్పుడు బిగ్ బాస్ చేయడానికి సిద్ధంగా లేకపోయినప్పటికీ.. ఏకంగా రెమ్యూనరేషన్ తో బాలకృష్ణను టెంప్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. అన్ స్టాపబుల్ షోలో 10 ఎపిసోడ్స్ కోసమే భారీ పారితోషకం అందుకున్న బాలకృష్ణ. ఇక 100 రోజుల పైగా సాగే బిగ్ బాస్ షో అంటే ఇక ఏ రేంజ్ లో పారితోషికం డిమాండ్ చేస్తాడో అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం బాలకృష్ణ ఎంత డిమాండ్ చేసినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట. ఏం జరుగుతుందో చూడాలి మరి.