బాలకృష్ణ, రెబల్ స్టార్ ప్రభాస్ ల తొలి కలయిక ఆన్ స్టాపబుల్ బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 1 29 రాత్రి 9 గంటలకు టెలికాస్ట్ కానున్నట్లు ఆహా నిర్వాహకులు ప్రకటించేశారు. సోషల్ మీడియాలో సాయంత్రం నుంచే దీని మీద కౌంట్ డౌన్ మొదలయ్యింది. ప్రభాస్ ప్రోమోలు విపరీతమైన ఆసక్తి రేపడం, అందులోనూ బాలయ్య ఎనర్జీ ఎవరూ ఇప్పటిదాకా అడిగే సాహసం చేయని ప్రశ్నలు టచ్ చేయడం,సాధారణ ప్రేక్షకుల్లోనూ ఎగ్జ్ జైట్ మెంట్ కు కారణమయ్యింది. చెప్పిన టైం 9 గంటలకు ఒక్కసారిగా అందరూ యాప్ లోకి ఎంటరయ్యారు. కోట్లాది ఫ్యాన్స్ కు ఇంకా స్ట్రీమింగ్ మొదలుకాకుండానే యాప్ క్రాష్ అయిపోయింది. సాధారణంగా విపరీతమైన లోడ్ పడితే తప్ప ఇలా జరగదు. ఓటిటిలో వచ్చే ఒక సెలబ్రిటీ టాక్ షో కోసం ఏకంగా వెబ్ సర్వరే హ్యాంగ్ అవ్వడం ఇదే మొదటిసారి. ఇంత రెస్పాన్స్ గతంలో ఎప్పుడూ చూడని ఆహా దెబ్బకు డౌన్ అయ్యింది. అదే సమయంలో HD క్వాలిటీ ఎపిసోడ్ ఇతర పైరసీ వెబ్సైట్ లో దర్శనమివ్వడం తో ఆహా టీమ్ ఖంగుతింది.. ఈ ఎపిసోడ్ ల టెలికాస్ట్ కి ముందే ఈ తరహా పైరసీ పై ఆహా టీం సైబర్ క్రైం కేసు నమోదు చేసింది. పోలీసులు కూడా కాపీ రైట్ కంటెంట్ ని వేరెవరూ పెట్టడానికి వీలులేదని ఆదేశాలు కూడా జారీచేశారు. అలాంటి టైం లో అప్ క్రాష్ అవ్వడం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఇక్కడే కాదు యుఎస్ తదితర దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని నెటిజెన్ల నుంచి వస్తున్న రిపోర్ట్. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులకు లేదా స్టార్ హీరో నటించిన వరల్డ్ ప్రీమియర్ కు తప్ప ఇలా జరగడం అరుదు. అలెర్ట్ అయిన ఆహా వెంటనే రంగంలోకి దిగింది. ఏ క్షణంలో అయినా పరిస్థితి మాములుగా మారి అందరూ చూసేయొచ్చు. అందులోనూ ఇప్పుడిప్పుడే సర్వర్ కెపాసిటీ మీద దృష్టి పెట్టి 4కెకు అప్ గ్రేడ్ అయిన ఆహాకు ఇలాంటి ఇబ్బందులు మున్ముందు సమస్యలు రాకుండా ఉపయోగపడతాయి. దీనికే ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు ముందస్తు ప్రిపరేషన్ చాలా అవసరం అయ్యేలా ఉంది. కేవలం షూటింగ్ కే మీడియాలో ఓ రేంజ్ రచ్చ జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయితే పరిస్థితి వేరుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.