త్వరలో పునఃప్రారంభం కానున్న అన్న క్యాంటీన్ల నిర్వహణకు, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు రూ.10వేల విరాళాన్ని అందజేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శుక్రవారం అశోక్‌బంగ్లాకు వెళ్లి ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అశోక్‌గజపతిరాజు రూ.10వేల చెక్కును కలెక్టర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో అశోక్‌గజపతిరాజు కుమార్తె విజయనగరం ఎంఎల్ఏ పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఇతర టిడిపి నాయకులు పాల్గొన్నారు.